నిత్యం ఎండు ఖ‌ర్జూరాల‌ను తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!
Spread the love

ఎండు ఖర్జూరాలు నీటిలో నానబెట్టి తింటే కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు… మిగిలిన డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే ఖర్జూరంలో శక్తినందించే క్యాలరీలు అధికంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వలన శరీరానికి కావల్సిన రోజువారీ పోషకాలు అందుతాయి. ఇందులో విటమిన్‌ బి1, బి2, బి5, ఎ మరియు సి తో పాటు ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ మరియు అధిక మొత్తంలో కాల్షియం, మేగ్నిషియం, మాంగనీస్‌ మరియు కాపర్‌ను కలిగి ఉంది. ఎండు ఖర్జూరాన్ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఆ ఖర్జూరంతో పాటు ఆ నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఫైబర్‌ ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులలో అంటిపెట్టుకొని ఉండిపోయిన వ్యర్ధాలను తొలగిస్తుంది. ఇందులో అధిక శాతం పొటాషియం ఉండటం వలన ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్‌ రక్తహీనత బారి నుండి కాపాడుతుంది. అంతేకాకుండా రక్తపోటును కంట్రోల్‌ చేస్తుంది. ఖర్జూరం శరీరంలో నీరసం మరియు నిసత్తువులను దూరం చేస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ బి5 మీ చర్మపు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇది డ్యామీజి అయిన చర్మపు కణాలను బాగు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు మరియు కండరాలకు శక్తిని ఇస్తుంది. ఇందులో ఉండే పోషకాలు మీ జుట్టును కుదళ్ల నుండి బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంతో ఎదిగేలా సహాయపడుతుంది. రేచీకటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. మలబద్దకం మరియు అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియలు సాఫీగా జరిగేందుకు దోహదపడుతుంది.

ఖర్జూరాలు తేనెలో నానబెట్టి తింటే కలిగే లాభాలు : ఒక జార్‌లో మూడువంతుల తేనెను తీసుకొని విత్తనం తీసిన ఎండు ఖర్జూరం పండ్లను వేయాలి. ఆ జార్‌ని బాగా షేక్‌ చేసి వారం రోజుల పాటు కదిలించకుండా ఉంచాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఆ జార్‌ని షేక్‌ చేసుకోవచ్చు. వారం తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినాలి. అలా చేస్తే దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గుతాయి. శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయి. శరీర రోగ నిరోధక శక్తి రెట్టింపవుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. నిద్రలేమితో బాధపడేవారు ఈ మిత్రమం తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన లాంటివి కూడా తగ్గుతాయి. యాంటిబయాటిక్‌ గుణాలు ఉండటం వల్ల గాయాలు కూడా త్వరగా మానుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు రోజూ ఈ మిశ్రమం తినిపిస్తే వారు చదువుల్లో బాగా రాణిస్తారు. పెద్దలు కూడా ఈ మిశ్రమం తింటే మతిమరుపు తగ్గుతుంది. మహిళలకు కావల్సిన కాల్షియం, ఐరన్‌ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్త హీనతను తగ్గించి, ఎముకలను దృఢపరుస్తాయి. సీజనల్‌గా వచ్చే అనేక రకాల ఎలర్జీలు తగ్గుతాయి. డయాబెటీస్‌ పేషంట్లకు ఇది మంచి ఔషధం. షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. పలురకాల క్యాన్సర్లకు ఈ మిశ్రమం విరుగుడుగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం, గ్యాస్‌, అజీర్తి, వంటి సమస్యలు ఉండవు. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. రక్త సరఫరా సరిగా జరిగేలా మెరుగు పరుస్తుంది. రక్త హీనత ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది. బి.పి. తగ్గుతుంది, గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ నశించి, మంచి కొలెస్ట్రాల్‌ వృద్ధి చెందుతుంది. అధిక బరువు తగ్గుతుంది, కొవ్వు ఉంటే కరిగిపోతుంది.