పుదీనా పేస్ట్ తో అందం మీసొంతం..
Spread the love

పుదీనా పేస్ట్, టమాటా గుజ్జులో కోదీగా నిమ్మరసం, ఉప్పు కలుపాలి. ఈ మిశ్రమాన్ని కంటి కింద రాయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే నల్లటి వలయాలు తొలిగిపోతాయి.

ఆలూ రసం, పుదీనా పేస్ట్‌ను బాగా కలుపాలి. దూదిని ఈ మిశ్రమంలో ముంచి కంటి కింద ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే కళ్లు అందంగా తయారవుతాయి.

పుదీనా పేస్ట్, నిమ్మరసాన్ని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. తరుచూ ఇలా చేస్తే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.

పుదీనా పేస్ట్, శనగపిండిని బాగా కలిపి అందులో కొంచెం పసుపు కలుపాలి. ఈ మిశ్రమాన్ని కంటి కింద చర్మానికి రాయాలి. 30 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మురికి తొలిగి చర్మం కాంతివంతంగా మారుతుంది.

పుదీనా పేస్ట్‌లో రోజ్‌వాటర్ కలుపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరుసటి ఉదయాన్నే పేస్ట్‌ను దూదితో కళ్ల కింద ఐప్లచేయాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. తరుచూ దీన్ని పాటిస్తే రక్తప్రసరణ మెరుగుపడి నల్లటి వలయాలు తొలిగిపోతాయి.