ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలు…
Spread the love

మనశరీరానికి ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్. ఉసిరి పోషకాల గని అని చెప్పుకోవచ్చు. ఉసిరి వాడకం వలన జుట్టు మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిసిందే, జుట్టు మరియు చర్మ ఉత్పత్తులలో ఉసిరిని విరివిగా వాడుతున్నారు, కానీ ఉసిరి వాడకం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గత 5000 సంవత్సరాల నుండి, ఉసిరి (ఫిలంథస్ ఎంబ్లికా)ని భారతదేశంలో విరివిగానూ మరియు ఇతర దేశాలలో కూడా అధికంగానూ వాడుతున్నారు. వివిధ రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగించే అద్బుతమైన ఆహరంగా దీన్ని పేర్కొనవచ్చు.

  • ఉసిరి విటమిన్ ‘C’ని పుష్కలంగా కలిగి ఉండి, జలుబు, క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వంటి సాధారణంగా, సహజంగా కలిగే వ్యాధులను తగ్గిస్తుంది. విటమిన్ ‘C’ లోపం వలన వారు దీన్ని తినటం వలన త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
  • ఉసిరి, కొవ్వు పదార్థాలను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. ఉసిరిని తినటం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార ప్రణాలికను తయారు చేసుకునే పట్టికలో ఉసిరిని కూడా కలపండి.
  • చేదుగా మరియు పుల్లని రుచి ఉండే ఉసిరిని తినటం వలన జీర్ణవ్యవస్థలోని రిసెప్టార్’లను ఉత్తేజ పరచి, జీర్ణక్రియ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది. అధిక మొత్తంలో ఫైబర్’లను కలిగి ఉండటం వలన జీర్ణక్రియ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. పేగు కదలికలను మెరుగుపరచటమే కాకుండా జీర్ణక్రియ అవయవాలను శుభ్రపరుస్తుంది.
  • భారత దేశంలో చాలా మంది ఉసిరిని వాడటం వలన దీనిని ఇంట్లో ఉండే సహజ ఔషదంగా చెప్పవచ్చు. మార్కెట్’లో చాలా రకాల కేశ సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, వీటి తయారీలో ఉసిరిని వాడుతున్నారు. ఉసిరి, జుట్టును ఆరోగ్యంగా, వత్తుగా, పొడవుగా మరియు మెరిసేలా చేస్తుంది.
  • ఉసిరి వివిధ పాలీఫినాల్’లను కలిగి ఉండటం వలన, ఫ్రీరాడికల్’ల వలన కలిగే ఆక్సిడేషన్’ను నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది. ఫ్రీ రాడికల్’లు, శరీరంలో ఆక్సిడేషన్ చర్య జరిపి ప్రమాదానికి గురి చేస్తాయి. ఉసిరి, ఈ చర్యలను నిలిపివేసే పాలీఫినాల్’లను కలిగి ఉండి, ఈ చర్యలను జరగాకుండా అడ్డుపడుతుంది.
  • ఉసిరి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజానలను కలుగ చేయటమే కాకుండా, వివిధ రకాల వ్యాధి కారకాలతో పోరాడుతుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంచి, జలుబు మరియు దగ్గు వంటి సాధారణ జబ్బులను నయం చేస్తుంది.
  • చర్మ సమస్యలు కలగటానికి కారణం- కాలేయం సరిగ్గా పని చేయకపోవటం వలన అని చెప్పవచ్చు. రోజు ఉసిరిని తినటం వలన, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్’లు, కాలేయ విధులను మెరుగుపరుస్తాయి. ఫలితంగా చర్మ వ్యాధులు కలిగే అవకాశం తగ్గి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఉసిరి తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలను కలిగి ఉండటం వలన చాలా ప్రయోజనాలను కలుగ చేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి మంచి ఆహారంగా చెప్పవచ్చు. శరీర జీవక్రియ రేటును పెంచి, కొవ్వు పదార్థాల వినియోగాన్ని పెంచుతుంది.
  • తక్కువ క్యాలోరీలు మరియు అధిక మొత్తంలో పోషక విలువలను కలిగి ఉంటుంది. 100 గ్రాముల ఉసిరిని నుండి కేవలం 60 క్యాలోరీలు మాత్రమె అందించబడతాయి. వివిధ రకాల విటమిన్’లను మరియు మినరల్’లను పుష్కలంగా కలిగి ఉంటుంది.