పెళ్లికి  అనుష్క  గ్రీన్ సిగ్నల్ ?
Spread the love

అందాల భామ అనుష్క పెళ్లికి పచ్చజెండా ఊపిందా..? అవుననే ప్రచారమే ఇప్పుడు సోషల్‌మీడియాల్లో వైరల్‌ అవుతోంది. అందానికి, అభినయానికి మారు పేరు అనుష్క. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. ఈ బ్యూటీకి త్వరలో పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకే అనుష్క పెళ్లిపై చాలా వదంతులు ప్రచారం అవుతూ వచ్చాయి. అందులో నటుడ ప్రభాస్‌తో ప్రేమాయణం అనీ, త్వరలో ఆయన్ని పెళ్లి చేసుకోనుందంటూ వదంతులు హోరెత్తాయి.

అనుష్కను ప్రభాస్‌ పెళ్లి చేసుకోవడానికి ఆయన కుటుంబసభ్యులు అంగీరించలేదనే ప్రచారం కూడా జరిగింది. కాగా అనుష్క మంచి స్నేహితురాలు మాత్రమే అని ఇటీవల ప్రభాస్‌ స్పష్టం చేశారు. ఇంతకాలం చిత్రాలతో బిజీగా ఉన్న అనుష్క ఆ సాకుతో పెళ్లిని వాయిదా వసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కొత్త చిత్రం ఒక్కటీ కూడా అంగీకరించలేదు. పలు అవకాశాలు వస్తున్నా, నచ్చిన కథ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల ఒక భేటీలో అనుష్క పేర్కొన్నారు. మరోపక్క తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని పోరుతూనే ఉన్నారు. రెండేళ్లుగా అనుష్కకు వరుడిని చూసే పనిలో ఉన్నా.. సెట్‌ కావడం లేదని సమాచారం.

జాతక దోషం ఉందని జ్యోతిష్కులు చెప్పడంతో దోషం నివారణ కోసం ఇటీవల అనుష్కతో దైవ పూజలు నిర్వహించారు. ఆ పూజల ఫలమే కావచ్చు అనుష్క మనసు పెళ్లిపై మరలిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు ఉండవచ్చు. ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి ఈ స్వీటీ ఓకే చెప్పారట. ఈ ఏడాదిలోనే అనుష్క పెళ్లి చేసేయాలని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మీడియా వర్గాల సమాచారం. వాస్తవం తెలియాలంటే మాత్రం అనుష్క నోరు తెరవాల్సిందే.