ప్రభాస్ అంటె చాలా ఇష్టం   స్టార్ హీరో కూతురు..
Spread the love

ప్రముఖ తమిళ హీరో విశాల్ – హీరోయిన్ వరలక్ష్మి ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం మన అందరకి తెల్సిందే. అయితే ఇద్దరు మాత్రం తమ ప్రేమ గురించి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా కూడా విశాల్ తనకు మంచి స్నేహితుడు అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా కూడా నటిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ.. తెలుగు హీరోల్లో తాను ప్రభాస్ ను ఎక్కువగా అభిమానిస్తాను. నేను మాత్రమే కాదు ప్రస్తుతం దేశంలో ఎంతో మంది ఆయన్ను అభిమానిస్తూ ఉన్నారు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్ అయ్యాను. ప్రభాస్ స్టైల్ మరియు ప్రభాస్ నటన తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే క్షణం ఆలోచించకుండా ఓకే చెప్తాను అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక హీరోయిన్స్ లో కీర్తి సురేష్ అంటే ఇష్టం అంటూ నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నటనకు నేను ఫిదా అయ్యాను. అద్బుతమైన నటన మరియు ఆకట్టుకునే రూపం ఆమె సొంతం అంటూ సాటి హీరోయిన్ గురించి ఏమాత్రం ఈగో ఫీలింగ్స్ లేకుండా కీర్తి సురేష్ చెప్పడం అందరిని కొంచెం వింతగా అనిపించింది.