టాలీవుడ్ దర్శకుడు హీరోగా  మారబోతున్నాడంట ??
Spread the love

తెలుగులో సినిమా ఇండస్ట్రీ లో దర్శకులు అవుదామని వచ్చి హీరోలు అయినవారు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారని మనకు తెలిసిందే. రవితేజ.. నాని.. రాజ్ తరుణ్ లు ఇలా హీరోగా మారినవారే. కానీ ఒకసారి డైరెక్టర్ గా పేరొచ్చాక ఎవరూ హీరో గా మరే ఆలోచన చేయరు. దానికి భిన్నంగా ఓ యంగ్ డైరెక్టర్ హీరోగా తన లక్కను చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. అనిల్ రావిపూడి. ‘పటాస్’.. ‘రాజా ది గ్రేట్’.. లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అనిల్ ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సినిమాకు దర్శకుడు. వెంకటేష్ – వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ దర్శకత్వం పక్కన బెడితే అనిల్ కు చాలారోజులనుండి హీరోగా మారాలని ఉందట. ఆ విషయమే తన సన్నిహితులకు చెప్పాడట. అనిల్ ఇప్పటికే ‘రాజా ది గ్రేట్’ సినిమాలో ఒక చిన్న సీన్ లో కనిపించాడు. ‘ఎఫ్ 2’ లో కూడా ఒక చిన్న క్యామియో చేశాడట. యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే అలా నటించాడట.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనిల్ రావిపూడి హీరోగా ఒక సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉన్నాడని కూడా అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే అంతకంటే బెస్ట్ లాంచ్ ఇంకేముంటుంది? మరి ఆ సినిమాకు లారెన్స్ స్టైల్లో అనిల్ రావిపూడి స్వయంగా దర్శకత్వం వహిస్తాడా లేదా వేరే డైరెక్టర్ ను చూసుకుంటాడా అనేది వేచి చూడాలిమరి.