యా౦కర్ సుమా నా మాజాకా
Spread the love

తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి పలు టీవీ ఛానెళ్లలో అనేక కార్యక్రమాలు రూపుదిద్దుకొంటున్నాయి. తెలుగులో ప్రధాన యాంకర్లు రష్మీ, శ్రీముఖి, సుమ, అనుసూయ తదితరులు తన అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఇటీవల తెలుగులో స్టార్ట్ అయిన ఎంటర్‌టైన్ ప్రొగ్రాంలో సుమను ఆటపట్టించేందుకు రష్మీ, శ్రీముఖి చేసిన ప్రాంక్ కాల్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. అసలు ఏం జరిగిందంటే

సుమకు శ్రీముఖి ప్రాంక్ కాల్ రష్మీ యాంకర్‌గా వ్యవహరించే ఓ వినోద కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి ప్రాంక్ కాల్ చేయాల్సి వచ్చింది. దాంతో సుమకు ప్రాంక్ కాల్ చేస్తానని శ్రీముఖి చెప్పి కాల్ చేసింది.

గుంటూరు నుంచి పుష్పను

సుమకు శ్రీముఖి కాల్ చేసి.. గుంటూరు నుంచి నేను పుష్ఫను కాల్ చేస్తున్నాను. చాలా కష్టపడితే నీ ఫోన్ నంబర్ దొరికిందమ్మా. నీతో ఫోన్‌లో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది అని శ్రీముఖి గొంతు మార్చి చెప్పింది.  శ్రీముఖికి సుమ పంచులు నీతో మాట్లాడినందుకు తర్వాత ఈ రోజు అన్నం తిననే అని శ్రీముఖి అనగా.. మూడు రోజులు పాటు తినకు. చాలా మందికి భోజనం మిగులుతుంది సుమ బదులిచ్చింది. దాంతో టెలివిజన్‌లో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు సుమమ్మా అని శ్రీముఖి అనగానే.. లేదమ్మా నేను ఫోన్‌లో మాట్లాడుతున్నాను అని సుమ పంచ్ ఇచ్చింది.

స్టార్ మహిళకు వస్తా నాకు స్టార్ మహిళ కార్యక్రమంలో పాల్గొనాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉంది. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను. ఏదో ఒకరోజు స్టార్ మహిళలకు పోతా. అక్కను కలుస్తానని నా మొగుడికి చెప్పాను అని శ్రీముఖి చెప్పింది. కాళ్లు వాట్సప్‌లో పంపిస్తా సుమమ్మా నీవు ఊ అంటే ఒక్కసారి స్టార్ మహిళలకు వచ్చిపోతాను అని ఫోన్‌లో వెంటపడింది. నీ బిజీగా ఉన్నాను అని సుమ చెబుతుండగా.. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటా అని శ్రీముఖి చెప్పగా.. కావాలంటే నా కాళ్లు వాట్సప్‌లో పంపిస్తా.. అప్పుడు నా కాళ్లను పట్టుకో అని సుమ పంచ్ విసిరింది. స్టార్ మా ఆడిషన్స్‌కు రా స్టార్ మహిళలో వచ్చిన తర్వాత నీ పేరు రాసి సచ్చిపోతా అని శ్రీముఖి సుమను వేధించింది. దాంతో ‘కావాలంటే స్టార్ మహిళ ఆడియేషన్స్‌ జరుగుతాయి. ఆ ఆడిషన్స్‌కు వచ్చి సెలెక్ట్ అయితే అందులో పాల్గొనవచ్చు అని సుమ చెప్పింది.

రష్మీని గుర్తుపట్టిన సుమ శ్రీముఖి, సుమ మధ్య ఈ సంభాషణ కొనసాగుతుండగా రష్మీ ఫోన్ తీసుకొని మాట్లాడింది. రష్మీ గొంతును సుమ గుర్తుపట్టిన తర్వాత ఓ ఎంటర్‌టైన్‌మెంట్ షో కోసం చేసిన ప్రాంక్ కాల్ అని చెప్పింది. దాంతో ఆ ఎపిసోడ్ సందడిగా ముగిసింది. సుమ వేసిన పంచులు సరదాగా ఉన్నాయి.