అప్పుడే ఆయనకు మనసిచ్చేశాను : టాక్సీవాలా హీరోయిన్
Spread the love

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్-యూవి క్రియేషన్స్ సంయుక్తంగా విజయ్ దేరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమా ద్వారా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక జవాల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 సంవత్సరాల నుంచి అల్లు అర్జున్ అంటే ఇష్టం పెరిగింది. ‘టాక్సీవాలా’ ఆడిషన్స్‌కు వెళ్లినపుడు పర్సనల్‌గా చూశాను. అప్పుడే ఆయనకు మనసిచ్చేశాను. ఆయన తీసుకున్నారో లేదో తెలియదు. గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లినప్పుడల్లా ఆయన ఉంటారేమో అని ఆసక్తిగా చూస్తుంటాను అని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చారు.

నా డ్రీమ్ రోల్ అల్లు అర్జున్‌తో కలిసి నటించడమే… ఆయనతో కలిసి నడిచే చిన్న సీన్ అయినా చాలు. ఎలాంటి రోల్ అయినా కళ్లు మూసుకుని ఒప్పుకుంటానని ప్రియాంక జవాల్కర్ స్పష్టం చేశారు. ఆల్రెడీ గీతా ఆర్ట్స్‌లో ‘టాక్సీవాలా’ చేస్తున్నారు కదా…. అల్లు అర్జున్ తో ఛాన్స్ ఇవ్వమని అడగండి అని యాంకర్ ప్రశ్నించగా…. ప్రియాంక ఫన్నీ రిప్లై ఇచ్చారు. మీ ప్రశ్నలతో నన్ను ఫసక్ చేసేలా ఉన్నారు. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడం వేరు, అల్లు అర్జున్‌తో చేయడం వేరు. అది నెక్ట్స్ లెవల్… సెకండ్ సినిమాకే అల్లు అర్జున్‌తో ఛాన్స్ రావడం అసాధ్యమన్నారు.