డైరెక్టర్ మరుతితో  రానున్న  అల్లు అర్జున్ ??
Spread the love

డైరెక్టర్ మారుతి మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా అల్లువారి కుటుంబానికి ఎంత సన్నిహితుడో మన అందరికీ తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మారుతిల మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. కానీ ఎందుకో ఇప్పటివరకూ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వర్క్ అవుట్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఆదిశగా ఒక అడుగుముందుకు పడిందట. ఈమధ్యే మారుతి ఒక ఇంట్రెస్టింగ్ కథను అల్లు అర్జున్ కు వినిపించాడట. స్టొరీ ప్లాట్ బన్నీకి నచ్చినా పూర్తి కథతో సాటిస్ ఫై కాలేదట. దానంతో సెకండ్ హాఫ్ స్టొరీకి కొన్ని మార్పుచేర్పులు సూచించాడట. మారుతి అందుకు సరే అన్నాడని.. వీలైనంత త్వరగా కథలో మార్పులు చేసి బన్నీని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడని టాక్. అంతా సవ్యంగా జరిగితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు.

అయితే బన్నీ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మారుతి స్క్రిప్ట్ కనుక నచ్చితే త్రివిక్రమ్ సినిమాతో పాటుగా ఈ సినిమాపై కూడా ప్యారలల్ గా పని చేసేందుకు బన్నీ రెడీగా ఉన్నాడట. సో.. ‘నా పేరు సూర్య’ తర్వాత వచ్చిన గ్యాప్ ను ఇలా రెండు సినిమాలతో కవర్ చేయాలని అల్లు అర్జున్ ప్లానింగ్. ఇది ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే అని చెప్పాలి.