మళ్ళి పెళ్లి చేసుకోబోతున్న సింగర్‌ సునీత?
Spread the love

టాలీవుడ్‌ ఫిలిం ఇండస్ట్రీ లో  తన సుమధుర గానంతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు సింగర్‌ సునీత. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొవల్సి  వచ్చి౦ది.  తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో హాల్ చల్  చేస్తుంది. అది ఏంటి అంటే

ఆమె త్వరలో మరో వివాహం చేసుకోబోతుందన్నది ఆ వార్త ఉద్దేశ్యం. అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరు? అన్నదానిపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. ఈ వార్తపై సింగర్‌ సునీత ఎలా స్పందిస్తారో చూడాలి.

అయితే  చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ‘సునీత ఉపద్రష్ట’.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు సునీత . 19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయి వేరుగా ఉంటున్నారు సునీత.

ఇక రెండో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్వ్యూలో ఆమె చెప్పుతూ .. అలాంటి ఆలోచనేం లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారంటూ కొన్ని కథనాలు ఇప్పుడు వినిపిస్తుయి.   మరి ఆమె దీనిపై  ఎలా స్ప౦ది స్పందిస్తారో చూడాలి.