నానికి విలన్ గా నటించబోతున్న యంగ్ హీరో!
Spread the love

తెలుగు ప్రేక్షకులకు ‘బొమ్మరిల్లు’ .. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలా ద్వారా సిద్ధార్థ్ బాగా చేరువయ్యాడు. ఆ తరువాత ఆ స్థాయి విజయాలను అందుకోలేక వెనకబడిపోయాడు. ప్రస్తుతం ఆయన తమిళంలోనే చేస్తూ వస్తున్నాడు. అలాంటి సిద్ధార్థ్ త్వరలో తెలుగు తెరపై విలన్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. నాని హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి దర్శకుడు విక్రమ్ కుమార్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ థ్రిల్లర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో యంగ్ విలన్ అవసరం కావడంతో, విక్రమ్ కుమార్ .. సిద్ధార్థ్ ను సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఇప్పటికే తెలుగులో యంగ్ విలన్ గా ఆది పినిశెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అదే బాటలో సిద్ధార్థ్ కూడా కొనసాగుతాడేమో చూడాలి.