హీరోకంటే  శృతి కే ఎక్కువ  రెమ్యూనరేషన్ !!
Spread the love

స్టార్ హీరోయిన్ అయినా శృతి హాసన్ తన కెరీర్ ను ఫ్లాపులతో మొదలుపెట్టింది. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ తో నటించిన తర్వాత పూర్తిగా కెరీర్ మారిపోయింది.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మారింది. కానీ గత రెండేళ్లలో మళ్ళీ ఫ్లాపులతో సినిమాలు తగ్గిపోయాయి. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే తో ప్రేమవ్యవహారం కూడా ముదిరి పాకాన పడడంతోనే సినిమాలకు దూరమైందనే టాక్ కూడా ఉంది. తాజాగా శృతి ఒక హిందీ సినిమాకు సైన్ చేసింది. ‘ఠాకూర్ దేవదాస్’ అనే టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తున్నాడు. నజీరుద్దిన్ షా.. అమోల్ పాలేకర్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో విద్యుత్ కంటే శృతి డబల్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తోందట. అంతే కాదు ఈ సినిమాకు పేమెంట్ డైలీ బేసిస్ లో అడ్వాన్సుగా తీసుకుంటుందట. తన మేనేజర్ అడ్వాన్సు ముట్టిందని చెప్తేనే ఆ రోజు షూటింగ్ లో పాల్గొంటుందట. శృతి వాలకం చూస్తుంటే ముక్కుపిండి మరీ నిర్మాతల దగ్గర డబ్బు వసూలు చేస్తూనట్టుగా అనిపిస్తోంది మరి?

ఇక ఈ సినిమా కాకుండా మరే ఇతర సినిమాలో కూడా నటించడం లేదని తెలుస్తుంది. బాలీవుడ్ సినిమాలతోనే సరిపెట్టుకుంటుందా లేదా మళ్ళీ తెలుగు.. తమిళ సినిమాలలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది ఇంకా తెలియదు. సినిమాలే కాకుండా శృతి ఒక ఇంటర్నేషనల్ సింగర్ గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కొత్త ఏడాది శృతి యాక్టింగ్ అండ్ సింగింగ్ కెరీర్ ఎలా ఉండబోతోందనేది వేచి చూద్దాం మరి.