‘అమృత అయ్యర్’ తో ‘శేఖర్ కమ్ముల’
Spread the love

శేఖర్ కమ్ముల చిత్రాలు వరస గా ఫ్లాపవుతున్న దశలో ‘ఫిదా’ విజయం ఆయనను మరోసారి హాట్ షాట్ దర్శకుడిగా మార్చింది. శేఖర్ కమ్ముల ఒక చిత్రానికి మరో చిత్రానికి మధ్య గ్యాప్ ఎక్కువగా తీసుకుంటాడు.స్టోరీ తయారు చేసుకోవడం.. నటీనటుల ఎంపిక లాంటివాటిమీద ఎక్కువ సమయం వెచ్చిస్తాడు శేఖర్. ‘ఫిదా’ తర్వాత అలానే సమయం తీసుకున్న శేఖర్ కొత్త నటుల తో ఒక లవ్ స్టోరీని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాడు.

ఇప్పటికే శేఖర్ కమ్ముల కథానాయకుడు ని సెలెక్ట్ చేసుకున్నా డట. ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కుమారుడిని శేఖర్ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడట. కానీ ఆ యువ కథానాయకుడు ఎవరన్న సంగతి మాత్రం ఇంకా తెలియలేదు.మరోవైపు ఈ చిత్రంలో కథానాయికగా ఒక కన్నడ బ్యూటీని శేఖర్ కమ్ముల ఫిక్స్ చేశాడట. అమృత అయ్యర్ పేరున్న ఈ భామ తమిళంలో విజయ్ అంటోనీ చిత్రం ‘కాళి’ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కన్నడ లో కూడా ఒక మూవీ సైన్ చేసిందట. ఈమధ్యే ఈ భామ హైదరాబాద్ వచ్చి ఆడిషన్లో పాల్గొని కమ్ముల సార్ ను మెప్పించిందట.

ఈ చిత్రానికి ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ చిత్రాన్ని లాంచ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ నిర్మిస్తాడు.