కళ్యాణ్ రామ్ కు నో చెప్పడానికి కారణం ఇదేనా..?
Spread the love

ఫిదా మూవీ తో అందర్నీ ఆకట్టుకున్న సాయి పల్లవికి టాలీవుడ్ లో భారీగా అవకాశాలు వస్తున్నాయి. వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయింది. అయితే ఆమె మాత్రం వచ్చిన అవకాశాలన్నింటికీ ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ ఆఫర్ ను వదులుకున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉయ్యాలా జంపాల, మజ్ను వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విరించి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి అయితే బాగుంటుందని చెప్పి ఆమెకు కథ చెప్పారట. కథ విన్న తరువాత సాయి పల్లవి నో చెప్పిందట. హీరోయిన్ పాత్రకు సరైన గుర్తింపు లేకపోవడమే ఇందుకు కారణం అని తెలుస్తున్నది. పాత్ర చిన్నదైనా సరే గుర్తింపు వచ్చే పాత్రల్లోనే నటిస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఇలాగే కూర్చుంటే ముందు ముందు చాల కష్టమని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్ తో ‘పడిపడిలేచే మనసు’ అనే సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.