రాశీ ఖన్నా… ఆ విషయంలో లేడీ ప్రభాస్‌.!
Spread the love

అందంతోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రాశీఖన్నా. రాశీఖన్నా ఊళ్లో వుందంటే ఇండస్ట్రీలో చాలా మందికి పండగ. ఎందుకంటే ఎవరైనా షూటింగ్‌ గ్యాప్‌ వస్తే రెస్ట్‌ తీసుకోవాలని చూస్తారు. కానీ రాశి ఖన్నా మాత్రం ఖాళీ దొరికినపుడల్లా పార్టీలు విసురుతుంటుంది. పార్టీలు అంటే అల్లాటప్పా పార్టీలు కాదు. రాశి పార్టీ ఇస్తోందంటే జ్వరంతో వున్న సెలబ్రిటీలు కూడా చంటిపిల్లల్లా బూరలు పట్టుకుని దిగిపోతారని టాకు. ఎప్పటికప్పుడు పార్టీలు ఇచ్చినా కానీ ప్రతిసారీ కొత్తగా వుండేలా చూసుకుంటుందట. వంటలు, మధుపానీయాలు, నృత్యాలు.. వాట్‌ నాట్‌, అన్నిట్లో రాశి ఖన్నాని బీట్‌ చేయగల సెలబ్రిటీనే లేరట. అయితే ఒకరు మాత్రం ఆమెకి మించిన పార్టీలు, విందు వినోదాలు ఇస్తారని చెప్పుకుంటారు. ప్రభాస్‌ పార్టీ ఇచ్చాడంటే దాని గురించి పది రోజులు మాట్లాడుకోవాల్సిందే అన్నట్టుగా వుంటుందట. భీమవరం రాచ మర్యాదలన్నీ అతిథులకి చేసేసే ప్రభాస్‌ వంటల విషయంలో పాటించే జాగ్రత్తలకి ఎవరికైనా మెంటల్‌ ఎక్కిపోవాల్సిందేనట.