లక్ష్మీపార్వతి పాత్ర ఫై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!
Spread the love

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి రెండు రోజులుగా ఓ వార్త హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో ముంబై మోడల్ రూపాలి సూరి నటిస్తోందంటూ ప్రచారం మొదలైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ తిరుపతి ప్రెస్ మీట్ సమయంలో రూపాలి కనిపించడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. వర్మ తన సినిమాల ద్వారా కొత్త హీరోయిన్లను పరిచయం చేయడం మామూలే. లక్ష్మి పార్వతి పాత్రకు కూడా అదే తరహాలో కొత్త బ్యూటీని పరిచయం చేయబోతున్నట్లు అంతా భావించారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు ఆమె ఎవరో, ఆరోజు తిరుపతి ఎందుకు వచ్చిందో వివరణ ఇచ్చారు. “లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర కోసం రూపాలి సెలక్ట్ అయిందంటూ ఓ సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. కానీ ఇది అవాస్తవం. మా భాగస్వాముల్లో ఒకరి భార్యకు రూపాలి స్నేహితురాలు. అందుకే ఆరోజు మేము తిరుపతి వచ్చినపుడు మాతో పాటు వచ్చింది. ఈ సినిమాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు.” అని రామ్ గోపాల్ వర్మ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.