అప్పుడే రాజమౌళి టైటిల్ అనౌన్స్ చేస్తారట…!
Spread the love

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ కథపై రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. తారక్, చెర్రీ అన్నదమ్ములని ఒక కథనం.. ప్రాణ స్నేహితులంటూ మరో కథనం.. భీకరంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో వీరిద్దరూ మరణించి.. మళ్లీ జన్మిస్తారని ఇంకో కథనం.. ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏది నిజమో తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్‌ను చిత్రబృందం అనుకుంటున్నట్టు ఊహాగానాలొచ్చాయి. మరి ఇది ఎంత వరకూ నిజమో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఈ మల్టీస్టారర్ సెకండ్ షెడ్యూల్ పూర్తవగానే రాజమౌళి తన సినిమా టైటిల్‌ను వెల్లడిస్తారట.