వర్షం లో తడుస్తున్న పూజా ఎందుకంటే?
Spread the love

తెలుగు లో నటించింది కొన్ని  సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులందరికీ హీరోయిన్ పూజా హెగ్డే బాగా తెలుసు . జిల్ జిల్ జిగేలు రాజా ఐటెం సాంగ్‌లో పూజా నటించి అందరిని మెప్పించింది . ఆ తరువాత కొన్ని రోజుల పాటు పూజా హెగ్డేకు  ఎక్కువ  ఛాన్సులు రాలేదు. కథలు నచ్చకో.. లేకుంటే నచ్చిన కథకు తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో పూజా హెగ్డే తెరపై కనిపించడం తగ్గిపోయింది

ఇప్పుడు రీసెంట్ గా  బాహుబలి  ప్రభాస్‌తో కలిసి నటిస్తోంది పూజా హెగ్డే. ప్రభాస్‌కు ఇది 20వ సినిమా. కె.కె. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీక్రిష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటలీలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్  ఫాస్ట్ గా  జరుగుతోంది. అయితే ఇటలీలలో వర్షం ఎక్కువగా పడుతుండటంతో షూటింగ్‌కు అంతరాయం కలుగుతోంది. కానీ పూజా హెగ్డే మాత్రం వర్షంపడితే తనకు ఇష్టం అని చెపుతుంది

వాన  పడుతున్నప్పుడు షూటింగ్ ఆగిపోవడం.. వెంటనే పూజా హెగ్డే రోడ్డుపైకి వచ్చి వర్షంలో తడుస్తూ  డాన్స్ చేస్తోంది. ఇది చూస్తున్న సినిమా యూనిట్ ఆశ్చర్యపోతున్నారు. టాప్ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డే చిన్నపిల్ల మనస్తత్వంతో డ్యాన్సులు వేయడం ఏమిటని షాక్ అవుతున్నారు . అయితే పూజా మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. వర్షంలో తడవడం చిన్నప్పటి నుంచి ఇష్టమని చెబుతోంది. ఎవరి ఇష్టం వారిదని చెబుతోంది పూజా.