పూజా హగ్దే అంత పేద అమ్మాయా..?
Spread the love

అక్కినేని నాగ చైతన్య నటించిన “ఒక లైలా కోసం” చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన పూజా హగ్దే..కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ తో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. కానీ డీజే చిత్రం తో తనలోని మరో యాంగిల్ చూపించి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే కూడ ఒకరు. అలాంటిది ఆమె పేద అమ్మాయి ఏమిటని అనుకుంటున్నారా. అవునండీ.. ఆమె దగ్గర డబ్బులు ఉండవట. అయితే అది నిజ జీవితంలో కాదు సినిమాలో… ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో రిచ్ అమ్మాయిగా కనిపించిన పూజా ప్రభాస్, రాధాకృష్ణల సినిమాలో మాత్రం చాలా పేద అమ్మాయిగా కన్పిస్తుందట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.