నా పేరు సూర్య సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నా రామ్ చరణ్
Spread the love

నా పేరు సూర్య సినిమా  ప్రి రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడు అని ఫిలింనగర్ టాక్ వినిపింస్తుంది మొన్న జరిగిన మూవీ రిలీజ్ సమయం లో బన్నీ మాటలాడుతూ  మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే కుటుంబం అని చెప్పకనే చెప్పాడు  

టాలీవుడ్ లో ఎన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నా కూడా బాక్స్ ఆఫీస్ విషయంలో మాత్రం కొంచెం కూడా తేడా రావడం లేదు. స్టార్ హీరోల సినిమాలు వరుసగా  విజయాలు అందుకుంటున్నాయి. ఈ ఏడాది కొంచెం డల్ గా స్టార్ట్ అయినా రంగస్థలం నుంచి మాత్రం సక్సెస్ లు ఊపందుకున్నాయి. రీసెంట్ గా మహేష్ బాబు – భరత్ అనే నేను కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక నెక్స్ట్ స్టైలిష్ స్టార్ కూడా అదే తరహాలో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

 వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసిన నా పేరు సూర్య సినిమా షూటింగ్ మొత్తానికి పూర్తయ్యింది. వరుసగా ప్రమోషన్స్ తో అంచనాలు కూడా పెరిగాయి. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే బన్నీ బజ్ క్రియేట్ చేశాడు. ఆ తరువాత సాంగ్స్ కూడా సినిమా స్థాయిని పెంచేశాయి. అయితే భరత్ అనే నేను సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకోవడానికి కారణం సినిమాకు ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. అంతే కాకుండా ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తారక్ రావడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు బన్నీ కూడా మెగా పవర్ స్టార్ ని తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఇన్వైట్ చేయనున్నాడు.

 ఏప్రిల్ 29న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈవెంట్ ను ప్లాన్ చేశారు. చరణ్ కూడా ఆ డేట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో అభిమానుల్లో హైప్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ – నాగబాబు సంయుక్తంగా నిర్మించారు. అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్ గా నటించగా విశాల్ శేఖర్ సంగీతం అందించారు. మే 4న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.