విడాకుల దిశగా తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి!
Spread the love

సందేశాత్మక, చారిత్రక అంశాలను తెరమీద చూపించే దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. అయితే, వ్యక్తిగత వైవాహిక జీవితంలో మాత్రం క్రిష్ ప్రయాణం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

హైదరాబాద్: ‘గమ్యం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు క్రిష్(జాగర్లమూడి రాధాకృష్ణ) అనతికాలంలోనే మంచి అభిరూచి గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీపుత్ర శాతాకర్ణి చిత్రాలతో తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రుద్రమదేవి జీవితకథ ఆధారంగా ‘మణికర్ణిక’ అనే మూవీ తీస్తున్నాడు. ఇదిలాఉండగా క్రిష్ తన సతీమణి రమ్యకు విడాకులు ఇవ్వనున్నాడనే వార్త ఇప్పుడు సినీపరిశ్రమలో తెగ హల్‌చల్ చేస్తోంది. 2016, ఆగస్టు 7న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు క్రిష్. అయితే పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం టాలీవుడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. క్రిష్, రమ్యలు పరస్పర అంగీకారంతోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.

పరస్పర అంగీకారంతో విడాకులు

ఏ అంశం దారితీసిందనేది పూర్తిగా తెలియరాలేదు. డాక్టర్ రమ్య.. డైరెక్టర్ క్రిష్ మధ్య అవగాహన కుదరలేదని.. అందుకే డైవొర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.కారణాలు ఏమిటో తెలియదు కానీ క్రిష్, ఆయన భార్య రమ్య విడాకులకు సిద్ధమయ్యారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరూ డైవర్స్ ఫైల్ చేసినట్లు సమాచారం.

2016 జరిగిన వివాహానికి ఇండస్ట్రీ మొత్తం హాజరు

క్రిష్‌. రమ్య వివాహం హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో ఆగస్టు 2016లో జరిగింది. ”దేవతలే బంధువుల్లా వస్తారంట… మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే… మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదమంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్నూ మా ఆవిడ్నీ ఆశీర్వదించాలని మా అమ్మ అంజనాదేవి, నాన్నగారు సాయిబాబుగారు కూడా మీకు మరీ మరీ చెప్పమన్నారు”… నా సినీ జీవితం ‘గమ్యం’తో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు ‘రమ్యం’గా మొదలవుతోంది… మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్‌ పంపిన ఆహ్వానంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే రెండేళ్లు కూడా నిండక ముందే వీరి దాంపత్య జీవితం ముక్కలవ్వడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.