కంగనా రనౌత్‌ తో ప్రభాస్ కు గొడవ ఎందుకంటే ?
Spread the love

బాహుబలి ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ల మధ్య ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ సందర్భంగా గొడవ జరిగిందని  తెలుస్తుంది . ఈ వ్యవహారం గురించి కంగనా రనౌత్ నోరు విప్పింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్‌తో ఏక్ నిరంజన్ సమయంలో కంగనా గొడవపడిందని ఒప్పుకుంది

 

ఈ  గొడవ సంగతేంటో తెలియదు కానీ సమయం వచ్చినప్పుడల్లా కంగనా ప్రభాస్‌ను దెప్పిపొడుస్తూనే  ఉంటుంది . తాజాగా మరోసారి కంగనా ప్రభాస్ గురించి మాట్లాడింది. ఏక్ నిరంజన్ సమయంలో మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

దాని తరువాత  తామిద్దరం మాట్లాడుకోవడమే మానేశామని చెప్పింది. కానీ ‘బాహుబలి’లో ప్రభాస్ నటన చూసి గర్వంగా ఫీలయ్యానని, ‘మణికర్ణిక’లో తన నటన చూసి ప్రభాస్ కూడా అదే విధంగా ఫీలవుతాడని కంగనా తన ఫ్రెండ్స్ తో చెప్పిందట ఇదంతా బాగానే ఉంది కానీ, ప్రభాస్‌‌తో కంగనాకు అసలు గొడవేంటో మాత్రం ఆమె నోరు విప్పట్లేదు.