రామ్ -‘పండుగాడు’
Spread the love

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఓ మూవీ సెట్స్‌పైకి వస్తుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి . ఆ వార్తలు నిజమే అంటూ హీరోయిన్ ఛార్మి మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలియజేసింది . ఈ ప్రాజెక్ట్‌ను వెల్లడిస్తున్నందుకు ఆనందంగా వుంది. మా సంస్థ నిర్మించబోయే కొత్త సినిమాని ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో చేయబోతున్నాం. పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై లావణ్య సమర్పణలో పూరీ కనెక్ట్స్ ఈ సినిమాని నిర్మించనుంది. వచ్చే సంవత్సరం మేలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని తెలిపింది. ఇందులో రామ్ గెటప్, లుక్ కొత్తగా వుంటాయని, జనవరిలో సినిమాని లాంఛనంగా సెట్స్‌పైకి తీసుకురానున్నారని సమాచారం .
హలో గురూ ప్రేమ కోసమే అనుకున్నంతగా సంతృప్తినివ్వలేకపోయినా ఆదరించారు. దీనికి బదులుగా ఈసారి వడ్డీతో సహా మీకు తిరిగిచ్చేస్తాను అంటూ రామ్ ఈ మధ్య ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. తన మాటలకు తగ్గట్టే మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని, ఈ సినిమాకి పండుగాడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సినిమా వర్గాల సమాచారం.