గ్లామరస్ రోల్స్  చెయ్యను  : హన్సిక
Spread the love

టాలీవుడ్ లో ‘దేశముదురు’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో సన్యాసినిగా నటించి మరీ అల్లు అర్జున్ ను తన వెనక తిప్పుకున్న హన్సికను ఎవరు మరచిపోగలరు చెప్పండి? ఆ తర్వాత చాలా తెలుగులో సినిమాల్లో నటించిన హన్సిక ఎందుకో కొలీవుడ్ కు మకాం మార్చింది. తెలుగులో అయితే దాదాపు కనిపించడం లేదు. ఈమధ్య హన్సిక పెళ్ళి గురించి మీడియాలో జోరుగా వార్తలు వస్తుండడంతో ఆమె స్పందించింది. అయితే ఇప్పుడు తన వయసు 27 అని.. ఎప్పుడూ వయసును దాచిపెట్టేందుకు ప్రయత్నించలేదని తెలియజేసింది. ఇక పెళ్ళి విషయం మాత్రం మా అమ్మగారికే వదిలేశానని చెప్పింది. తన మంచి చెడూ అమ్మే చూసుకుంటోందని అందుకే ఆమె ఎవరిని చేసుకోమని చెప్తే వారిని చేసుకుంటానంది. గతంలో హన్సిక కు శింబు తో లవ్ ఎఫైర్ జోరుగా సాగిందని.. పెళ్ళి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ శింబు లైఫ్ లోని ఇతర లవ్ ఎఫైర్ల మాదిరిగానే ఇది కూడా సైడ్ అయిపోయింది.

ఇక ఇదిలా ఉంటే తనకు ఆఫర్లేమీ తగ్గలేదని అంటోంది. గత ఏడాది కాలంలో 18 కథలు విన్నానని అందులో 4 కథలకు మాత్రమే ఓకే చెప్పానని తెలిపింది. దీంతో పాటు మరో షాక్ కూడా ఇచ్చింది. ఇకపై తాను గ్లామర్ రోల్స్ చేయడలుచుకోవడం లేదని.. ప్రాధాన్యత ఉండే పాత్రలు.. వీలయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తానని తెలిపింది. అంతా బాగానే ఉంది గానీ గ్లామర్ ఇండస్ట్రీ లో ఉంటూ గ్లామరస్ రోల్స్ చెయ్యను అనే కాన్సెప్ట్ ఏంటో మరి హన్సికాకే అర్ధం కావాలి.