దిశా పటాని గ్లామర్ ను ఇలా కూడా వాడుకుంటున్నారా…
Spread the love

లోఫర్ చిత్రంతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన దిశా పటాని , ఆ సినిమా ప్లాప్ అయినాగానీ ఆడియన్స్ మదిలో మాత్రం చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు అవకాశాలతో బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె సినిమాలకన్నా సోషల్ మీడియా లో ఎక్కువగా గడుపుతుంది.రోజు ఏదో ఒక బికినీ పోజ్ తో దర్శనం ఇచ్చి నెటిజన్లను రెచ్చగొడుతూ వస్తుంది. ఇదే అదును చేసుకున్న ఓ సంస్థ దిశా చేత ఓ హాట్ ప్రచారం చేయించినట్లు తెలుస్తుంది. దిశా తాజాగా ఓ కంపెనీ బ్రా లకు ప్రచార కర్త గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా దిశాపటానీ చేత హాట్ గా దివాళీ శుభాకాంక్షలు చెప్పించారు. ఈ ఫోటోలో ఆమె కెల్విన్ క్లెయిన్ స్పోర్ట్స్ బ్రా వేసుకుని కనిపించారు. బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రమోషన్ కోసమే ఆమె ఈ ఫోటో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలో ఆమెకు 14 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పోస్టు చేసినందుకు ఆమెకు సదరు కంపెనీ భారీ మొత్తం అందినట్లు సమాచారం. ఈ పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతూ , తెగ లైక్స్ కొడుతూ , షేర్ చేస్తున్నారు.

View this post on Instagram

🎆🎆🎆🎆🎆

A post shared by disha patani (paatni) (@dishapatani) on