3.0 ఛాన్స్ ఉంది ??
Spread the love

భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన మూవీగా ప్రచారం జరుగుతున్న 2.0 ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు ఎగబాకడం మొదలయ్యాయి. కథ విషయాన్ని పక్కన పెడితే విజువల్స్ ఎఫెక్ట్స్ ని శంకర్ ప్రెజెంట్ చేసిన తీరు చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్న చెన్నైలో నేషనల్ మీడియా సాక్షిగా జరిపిన ట్రైలర్ లాంచ్ లో దర్శకుడు శంకర్ పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు. పలువురు ప్రముఖులతో పాటు అక్కడే యాంకర్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

ముఖ్యంగా అందరు ఎదురు చూసిన 2.0 తర్వాత సీక్వెల్ గా 3.0 వస్తుందా అనే ప్రశ్న వచ్చింది. అయితే అందులో రజనీకాంత్ చేయడం గురించి మాత్రం అనుమానం లేకపోలేదు. శంకర్ దీనికి స్మార్ట్ గా సమాధానం ఇస్తూ అలంటి ఐడియా ఫ్లాష్ అయితే తప్పకుండ చేస్తాను అని చెప్పడం కొసమెరుపు. దీని తర్వాత భారతీయుడు సీక్వెల్ పనిలో ఉన్న శంకర్ అది పూర్తి చేయడానికి ఎంత లేదన్నా రెండేళ్లు తీసుకుంటాడు. ఆ తర్వాత 3.0 గురించి ప్లాన్ చేయొచ్చు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 2.0కే చాలా ఇబ్బంది పడిన రజని అది నిన్న మాటల్లో బయట పెట్టుకున్నారు కూడా. సో 3.0 సాహసం చేయకపోవచ్చు. అయితే ఒక ఛాన్స్ ఉంది. శంకర్ అడగాలి కానీ 3.0 లో నటించేందుకు ఎవరైనా ముందుకు వస్తారు. బెస్ట్ ఛాయస్ గా స్వయానా రజిని అల్లుడు ధనుష్ నే తీసుకోవచ్చు. వెర్సటైల్ యాక్టర్ గా ఒక ఫార్ములాకు కట్టుబడకుండా సినిమాలు చేస్తున్న ధనుష్ తో శంకర్ 3.0 చేయొచ్చు. అలా వద్దు సీనియర్ హీరోనే కావాలి అనుకుంటే అజిత్ ఉండనే ఉన్నాడు. ఇదంతా అంత ఈజీగా తేలేది కాదు లెండి. ఒక సినిమాకు కనీసం రెండు మూడేళ్లు టైం తీసుకునే శంకర్ మూడో భాగం గురించి మనసులో ఉన్నా ఇప్పట్లో బయటపడే అవకాశం అయితే మాత్రం లేదు.