సినిమా లో పాత్ర లకు సరిపోయే  వాళ్ళు మాత్రమే కావాలి  స్టార్లు వద్దు..
Spread the love

విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత గాథతో ఆయన తనయుడు హీరో బాలకృష్ణ చేస్తున్న బయోపిక్ లెక్కలు మారుతున్నాయి. ముందు ఈ సినిమాకు డైరెక్టర్ గా తేజను అనుకున్నారు. తరవాత తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. చాలా రోజుల సస్పెన్స్ తరవాత డైరెక్టర్ ఛైర్ లోకి క్రిష్ వచ్చాడు. క్రిష్ రాకతో ఈ సినిమా తీయబోయే స్టయిల్ మారుతోందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాల్లో శ్రీదేవి – జయప్రద హీరోయిన్లుగా నటించారు. దీంతో బయోపిక్ లో వాళ్ల రోల్స్ తప్పకుండా ఉంటాయి. ఈ రోల్స్ కు స్టార్ హీరోయిన్లను తీసుకుందామని బాలకృష్ణ అనుకున్నాడు. కానీ క్రిష్ ఆలోచన మాత్రం వేరేలా ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ పేరే పెద్ద ఆకర్షణ అని… మిగతా స్టార్లతో పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్నది క్రిష్ అభిప్రాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సినిమాకు కొత్త ఆకర్షణ ఏదీ రానప్పుడు భారీ కాస్టింగ్ వల్ల ఖర్చు పెరగడమే అవుతుంది.

ఇదే రీజన్ తో స్టార్ల జోలికి పోకుండా కేవలం ఆ క్యారెక్టర్ కు సూటయ్యే నటులతోనే షూటింగ్ చేయడానికి క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా వచ్చిన మహానటి సినిమాలోనూ కొన్ని రోల్స్ స్టార్లు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసినా సూపర్ గా క్లిక్ అయ్యాయి. అందులో క్రిష్ కూడా ప్రఖ్యాత దర్శకుడు కె.వి.రెడ్డి రోల్ చేశాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో క్రిష్ ఇదే రూల్ ఫాలో అయిపోవాలని చూస్తున్నాడనేది లేటెస్ట్ టాక్.