రానా తో తెలంగాణ అమ్మాయి రొమాన్స్..?
Spread the love

ఫిదా తో తెలంగాణ అమ్మాయి గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి..మొదటి చిత్రంతోనే యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఫిదా తర్వాత MCA చిత్రం చేసిన సాయి..కాస్త గ్యాప్ తర్వాత పడి పడి లేచే మనసుతో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో శర్వానంద్ హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లలో రన్ అవుతుండగా , తాజాగా సాయి పల్లవి కి మెగా ఛాన్స్ వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బహుబలి లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రం లో భల్లాల దేవా గా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా సరసన నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ వేణు ఉడుగుల- రానా హీరోగా ఒక పీరియాడిక్ మూవీ తెరకెక్కించనున్నారు. అదే విరాటపర్వం 1992. విరాటపర్వం సినిమా 50ఏళ్ల టైమ్ గ్యాప్ లో జరుగుతుందని దర్శకుడు చెబుతున్నాడు. ఈ మూవీలో రానా పక్కన సాయిపల్లవిని తీసుకున్నారట. కథకు సంబంధించి సాయిపల్లవి- దర్శకుడు వేణు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పీరియాడిక్ మూవీలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు.