బిగ్ బాస్ తెలుగు 2 : ఆమెతో పాటు 16 మంది పేర్లు కూడా తెరపైకి!
Spread the love

తెలుగులో గత ఏడాది ప్రారంభించిన బిగ్ బాస్-1 గ్రాండ్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ -2 కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ లో “ఈ సారి ఇంకొంచెం ఎక్కువ మసాలా“ అంటూ బిగ్ బాస్-2 ఎలా ఉండబోతోందో నాని చెప్పకనే చెప్పాడు. తాజాగా బిగ్ బాస్ -2 సీజన్ జూన్ 10 నుంచి ప్రారంభం కాబోతోందంటూ నాని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ -2లో `ఏదైనా జరగొచ్చు`అంటూ ఈల వేసి మరీ గోల చేస్తున్నాడు నాని. ‘జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2′ అంటూ నాని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతోపాటు ఆ షో ప్రసారమయ్యే టైమింగ్స్ కు సంబంధించిన ఓ పోస్టర్  ను కూడా నాని ట్వీట్ చేశాడు. సోమవారం నుంచి శుక్ర వారం వరకు రాత్రి 9.30 గంటలకు – శని – ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ -2 ప్రసారం కానుంది. గత ఏడాది 70 రోజుల పాటు సాగిన ఈ షో ….ఈ సారి 100 రోజులు కొనసాగనుంది.

ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైన ఎక్కువ మందికి చేరువైన సోషల్ ఎక్స్ పరిమెంట్ షో బిగ్ బాస్. దీనికన్నా మోస్ట్ సక్సెస్ ఫుల్ షో లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ షో ఇప్పటివరకు దాదాపుగా 500 సీజన్లు అంటే 40 వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 60 దేశాల్లో ఈ షో కు మంచి క్రేజ్ ఉంది. 1999లో నెదర్లాండ్స్ లో మొదటిసారిగా  బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభించిన షో ….కాలక్రమంలో బిగ్ బాస్ గా పాపులర్ అయింది. భారత్ లో తొలిసారిగా బాలీవుడ్ లో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే 11 సీజన్ లు పూర్తి చేసుకుంది. గత ఏడాది తెలుగు తమిళ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. విశ్వ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేసిన తమిళ బిగ్ బాస్ కు అంతగా క్రేజ్ రాలేదు. అయితే తెలుగులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేసిన బిగ్ బాస్ సూపర్ హిట్ అయింది. అయితే బిగ్ బాస్ సీజన్ -2కు ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో…..నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. మరి నేచురల్ స్టార్ నాని…ఈ షోని ఏ రేంజ్ లో రక్తి కట్టిస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో రెండో సీజన్ జూన్ 10 నుండి ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించినన సంగతి తెలిసిందే. హీరో నాని హోస్ట్ చేస్తున్న ఈ షో 100 రోజుల పాటు 16 మంది సెలబ్రిటీలతో ఆసక్తికరంగా సాగనుంది. అయితే ఇందులో పాల్గొనబోయే 16 మంది సెలబ్రిటీలు ఎవరు? అనేది హాట్ టాపిక్ అయింది. కంటెస్టెంట్స్ వివరాలు ముందే వెల్లడించకుండా షో ప్రారంభం అయ్యే రోజు వరకు సస్పెన్స్‌గానే ఉంచాలని షో నిర్వాహకులు నిర్ణయించారు. కానీ ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారంలోరి వచ్చాయి. ఈ లిస్టులో శ్రీరెడ్డి పేరు వినిపించడంపై అంతా షాక్ అవుతున్నారు. కాస్టింగ్ కౌచ్ అంశంతో వార్తల్లోకి ఎక్కిన శ్రీరెడ్డి పేరు కూడా బిగ్ బాస్ సీజన్ 2 విషయంలో హాట్ టాపిక్ అయింది. హీరో నాని మీద శ్రీరెడ్డి ఆరోపణలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి బిగ్ బాస్ ఇంట్లో అవకాశం ఉండక పోవచ్చని భావిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనే కంటెస్టెంట్స్‌లో హీరోయిన్ చార్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన చార్మి తర్వాత అవకాశాలు తగ్గి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమె సహ నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం అందుకోలేదు. ఇటీవల నిర్మించిన ‘మోహబూబా’ కూడా నష్టాలనే మిగిల్చింది.