అనుష్క పెళ్లి గురి౦చి  క్లారిటీ ఇచ్చిన తన తల్లి!!!
Spread the love

అనుష్క  అంటే అందం, అభినయానికి మారు పేరు. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకిగా వెలుగొందుతోన్న ‘దేవసేన’  పెళ్లిపై ఇప్పటికే ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయనే చెప్పాలి. అయితే ఈ బ్యూటీకి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకు తెలిసిన విషయమే  అయితే సహ నటుడు, ‘బాహుబలి’  ప్రభాస్‌తో అనుష్క పెళ్లి జరగునుందని వదంతులు ఉన్నాయి.

అంతేకాకుండా అనుష్కను పెళ్లాడేందుకు ప్రభాస్‌ కుటుంబసభ్యులు అంగీరించలేదనే ప్రచారం కూడా జరిగింది. కాగా అనుష్క మంచి స్నేహితురాలు మాత్రమే అని ఇటీవల ప్రభాస్‌ స్పష్టం చేశారు.

ఓ సినిమా వెబ్‌సైట్‌ చెప్పిన కథనం  ప్రకారం.. స్వీటి పెళ్లి గురించి ఆమె తల్లి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘అనుష్క, ప్రభాస్‌ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ప్రభాస్‌ వంటి మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అనుష్క భర్తగా రావాలని కోరుకుంటున్నాను. కానీ వారిద్దరు మంచి స్నేహితులు మాత్రమే.

అయితే ఇలాంటి వదంతులు ప్రచారం చేయడం మానుకోండి’  అంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు సదరు వెబ్‌సైట్‌ పేర్కొంది. సో ఇకనైనా ప్రభాస్‌ అనుష్క ‘  జంట గురించి ప్రచారమవుతోన్న వదంతులకు బ్రేక్‌ పడుతుందేమో చూడాలి మరి.