నాకు  అన్నీ  నా బేబీనే  : అమలాపాల్
Spread the love

వివాదాలతో ప్రచారం ఒక పద్ధతి.. వేడెక్కిస్తూ పబ్లిసిటీ కొట్టేయడం ఇంకో పద్ధతి. ఈ రెండిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా నిరంతరం మీడియాని హీటెక్కిస్తున్నారు కొందరు భామలు. ఆ కోవలోనే అమలా పాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ భామ తన భర్త.. దర్శకుడు ఏ.ఎల్.విజయ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అటు పై కెరీర్ పై దృష్టి సారించింది. కథానాయికగా రెండో ఇన్నింగ్స్ ని ఘనంగానే ప్రారంభించింది. గ్లామర్ రోల్స్ తో పాటు నాయికా ప్రధాన పాత్రలు.. ప్రయోగాత్మకమైన స్క్రిప్టుల్ని ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవలే ఈ బ్యూటీ నటించిన `రాక్షసన్` రిలీజై విజయం అందుకుంది. ఆ చిత్రంలో అమలాపాల్ బోల్డ్ లుక్ నటనకు పేరొచ్చింది. ప్రస్తుతం `అంద పారవై పోలా` అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో నటిస్తూ అమలాపాల్ గాయపడింది. అయితే ఈ గాయం టెంపరరీ మాత్రమే. మళ్లీ కోలుకుని షూటింగ్ ని ఫినిష్ చేస్తోంది.

ఇక ఈలోగా తనకు ఎంతో ఇష్టమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని తన ఇంట్లోనే జరుపుకుంది ఈ భామ. ఆ రోజు అమలాపాల్ తన కుటుంబ సభ్యులతో పాటు ఓ స్పెషల్ బేబితో గడిపింది. వీలున్నంత ఎక్కువ సమయం బేబికే కేటాయించిదట. ఆ ఫోటోలు ప్రస్తుతం వెబ్ లోకి వైరల్ అయ్యాయి. ఒక్కో ఫోటోలో ఒక్కో భంగిమతో అమలాపాల్ వేడెక్కించింది. నేల పై పొర్లింది.. నాలుక చాచి బయటికి పెట్టింది.. తుమ్మింది.. దగ్గింది.. బద్ధకంగా ఒళ్లు విరుచుకుంది. అయితే ఇన్నిపాట్లు ఎవరికోసం అంటే తాను ఎంతో ఇష్టపడే బేబి కోసమే. ఇంతకీ ఈ బేబి ఎవరు? అంటే ఇదిగో ఇక్కడ నేరుగా ఫోటోలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఈ బ్యూటిఫుల్ బేబి పెంపుడు కుక్క. అదేం చేస్తే అదే పని చేయడం అమలా హాబీ. తీరిక సమయాల్ని అలా టైమ్ స్పెండ్ చేస్తుందని తెలుస్తుంది.