అఖిల్ నాలుగో సినిమా.. త్వరలో …
Spread the love

అఖిల్ ప్రస్తుతం… వెంకీ అట్లూరి దర్శకత్వంలో బిజీగా ఉన్నాడు. ఇది అఖిల్ కు మూడవ చిత్రం. తొలి రెండు సినిమాలు అంతా విజయం అందించక పోవడంతో అఖిల్ ఈ చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా అఖిల్ 4వ చిత్రం గురించి కూడా అప్పుడే వార్తలు మొదలైపోయాయి. మలుపు చిత్రంతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు సత్య ప్రభాస్ పినిశెట్టి అఖిల్ లో సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఖిల్ ని కలసి సత్య ప్రభాస్ ఓస్టోరీ లైన్ వినిపించినట్లు తెలుస్తోంది. అఖిల్ సూచనప్రాయంగా దర్శకుడికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. సత్య ప్రభాస్ దర్శకత్వం తనకు సరికొత్త ఇమేజ్ తీసుకువస్తుందని అఖిల్ ఆలోచన….

Akhil fourth film confirmed