రచ్చరచ్చ చేసిన  దిశా ……
Spread the love

దిశా పటాని మనకు అంతగా పరిచయం లేని పేరే కానీ హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్న వాళ్లకు మాత్రం తను బాగా సుపరిచితురాలు. అంతే కాదు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ మోడల్స్ అకౌంట్స్ ని ఫాలో అయ్యేవాళ్ళకు తను ఎవరో తెలియకుండా ఉండే ఛాన్స్ లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు రచ్చ చేసే ఈ భాగీ బ్యూటీ తాజాగా వైట్ బికినీలో చేసిన రచ్చ రంబోలా అభిమానులకు కునుకును దూరం చేసేలా ఉంది. నునుపైన తెల్లని దేహం మీద అసలు ఉందా లేదా అనిపించే టూ పీస్ తో పర్ ఫెక్ట్ షేప్ కి నిర్వచనంలా అనిపిస్తున్న దిశా ఫోటోను ఒక్కసారి చూసి సంతృప్తి చెందటం అసాధ్యం.

అంత కిక్కిచ్చే హాట్ నెస్ ఇందులో ఉంది మరి. న్యూ ఇయర్ గిఫ్ట్ గా దిశా ఇచ్చిన ఈ ఫోజు సముద్రం అలల్లో విహరించే వేవ్ రన్నర్ మీద ఇచ్చింది. అయితే విచిత్రంగా అది సముద్రంలో కాకుండా ఎక్కడో ఒడ్డున పాక లాంటి షెడ్డులో ఉండటం విశేషం. అంటే బికినీ వేసుకుంది కానీ జలకాలాడుతున్న ఫోటో మాత్రం కాదిది. దిశా పటాని చేతిలో ప్రస్తుతం ఒక్క హిందీ సినిమా మాత్రమే ఉంది.

ఇక సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న భరత్ లో అతనికి చెల్లెలుగా నటించింది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ తనకు పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉంది దిశా. ఆఫర్లు వెల్లువగా రాకపోయినా ఇలా సోషల్ మీడియాలో కైపెక్కించే పిక్స్ తో హాట్ న్యూస్ లో నిలిచే దిశా పటానికి సరైన బ్రేక్ దొరకాలే కానీ ఇలాంటి స్కిన్ షోలతో వెండితెరపై రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఈ భామ.