రైతే నిజమైన రాజు
Spread the love

బంజారాహిల్స్‌: దేశానికి అన్నం పెట్టే రైతే నిజమైన రాజు అని మహర్షి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు అన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఉలవచారు రెస్టారెంట్‌ 6వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రెస్టారెంట్‌లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రైతులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు దర్శకుడు వంశీ, నిర్మాత దిల్‌రాజు పంచె, కండువాలు కప్పి సన్మానించారు. అనంతరం రైతులకు రెస్టారెంట్‌లోని ఉలవచారు బిర్యానీ, రాజుగారి కోడిపలావ్, కోనసీమ కోడివేపుడు, గద్వాల్‌ పలావ్, రొయ్యల వేపుడు వంటి వాటిని వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఉలవచారు రెస్టారెంట్‌ నిర్వాహకులు వినయ్‌ నరహరి, విజయ్‌ రెడ్డిలు పాల్గొన్నారు.