‘విజేత’ సినిమా రివ్యూ
Spread the love

నటీనటులు: కల్యాణ్‌దేవ్‌, మాళవిక నాయర్‌, మురళీశర్మ, నాజర్‌, సత్యం రాజేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రాజీవ్‌ కనకాల తదితరులు

సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌

సినిమాటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌

నిర్మాత: సాయి కొర్రపాటి

దర్శకత్వం: రాకేశ్‌ శశి

బ్యానర్‌: వారాహి చలన చిత్రం

‘విజేత’ ఈ పేరు వినగానే మనకు చిరంజీవి నటించిన చిత్రమే గుర్తొస్తుంది. తన కుటుంబ కోసం ఓ యువకుడు ఏం చేశాడనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే మెగా ఫ్యామిలీ కల్యాణ్ తెరంగేట్రానికి కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాకేష్‌ శశిని దర్శకుడిగా ఎంచుకున్నారు. తండ్రీ-కొడుకుల అనుబంధాన్ని ఈ చిత్రంలో ఎలా చూపించారు? తొలి చిత్రంతో చిరు అల్లుడు ఏమేరకు ఆకట్టుకున్నారు?

క‌థ‌:

శ‌్రీనివాస‌రావు(ముర‌ళీశ‌ర్మ) స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి. పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకున్న శ్రీనివాస‌రావు కుటుంబ ప‌రిస్థితుల కార‌ణంగా జీవితంలో అడ్జ‌స్ట్ అయిపోతాడు. కుటుంబ బాధ్యతల కోసం తనకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని పక్కన పెట్టి చిరు ఉద్యోగిగా మిగిలిపోతాడు. బిడ్డల్ని కష్టపడి చదివిస్తాడు. కానీ ఇంజినీరింగ్ పూర్తిచేసిన కొడుకు ఏ పని చేయకుండా ఖాళీగా ఆవారాగా తిరుగుతుంటాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటాడు. ఇలా కాదని తన మిత్రులతో కలసి సొంతంగా ‘సర్‌ప్రైజ్ ఈవెంట్’ అనే బిజినెస్‌ను ప్రారంభిస్తాడు. అది కాస్త బెడిసికొడుతుంది. అయితే జీవితం, కుటుంబంపై బాధ్యతలేని తన కొడుకుని చూసి శ్రీనివాసరావు కుమిలిపోతాడు.

విశ్లేషణ ;

ఇది. ఇలాంటి కథలు మనం చాలా చూసి ఉంటాం. ఆవారాగా తిరిగే కుర్రాడు మళ్లీ ఒక మంచి మార్గంవైపు నడిచి తల్లిదండ్రులు గర్వపడేలా ఎలా ఎదిగాడన్నదే ఈ సినిమా కాన్సెప్ట్‌. తండ్రికి కొడుకుపై ఉండే ప్రేమ.. కొడుక్కి తండ్రిపై ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేసిన సినిమాగా దీనిని అనుకోవచ్చు. మెగా అల్లుడు కల్యాణ్‌దేవ్‌ కథానాయకుడిగా పరిచయం అయిన సినిమా ఇది. కల్యాణ్‌దేవ్‌లోని బలాల్ని, మరింత బలంగా చూపించాలని కాకుండా, మాస్‌ హీరోగా ఎలివేట్‌ చేయాలని కాకుండా, కథను కథగా చెప్పాలనే ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. అయితే సెకండాఫ్‌లో తన తండ్రి స్నేహితుడు (తనికెళ్ల భరణి) రామ్‌కు గతం గురించి చెబుతాడు. కుటుంబం కోసం తన తండ్రి ఏం కోల్పోయాడో రామ్ తెలుసుకుంటాడు. చివరికి తండ్రిని గెలిపిస్తాడు. తండ్రి ఆశయాన్ని గెలిపించి రామ్ ‘విజేత’ అవుతాడు. అయితే సెకండాఫ్‌లో జరిగే డ్రామా మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందడం సినిమాకు మైనస్. దీనివల్ల ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీలవుతాడు.

సీరియస్‌గా కథ, కథనంలో సత్యం రాజేశ్‌ ఎపిసోడ్‌ నవ్వులను పంచుతుంది. పతాక సన్నివేశాలను భావోద్వేగాలతో నడిపించి, కంటతడి పెట్టించేలా చేశాడు. మొత్తంగా చూస్తే ఇదో ఫ్యామిలీ డ్రామా! తండ్రీ కొడుకుల అనుబంధానికి అద్దం పట్టిన చిత్రం. మాస్‌ ఎలిమెంట్స్‌ వినోదం, మిస్సయినట్లు కనిపించినా, ఇంటిల్లిపాదీ చూడటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శకుడు తెరకెక్కించాడు.

సాంకేతిక విభాగం..

నిర్మాత సాయి కొర్రపాటి చాలా రిచ్‌గా నిర్మించారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా కనిపించింది. ఫ్యాక్టరీ క్వార్టర్స్‌ను కూడా చాలా అందంగా చూపించారు. దర్శకుడు ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రాసుకున్నాడు. దాన్ని కుటుంబమంతా చూసేలా తీర్చిదిద్దాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు ;

తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్‌ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ ఆకట్టుకుంది. పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. హీరోయిన్ మాళవిక నాయర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యతలేదు. ఉన్నంతలో బాగానే నటించింది. తనికెళ్ల భరణి, వి.జయప్రకాష్, రాజీవ్ కనకాల తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

బలాలు

తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌

క్లైమాక్స్‌‌

నిర్మాణ విలువలు

మురళీశర్మ నటన

బలహీనతలు

ఫస్ట్‌ హాఫ్‌లో కాస్త నెమ్మదించిన కథనం

స్లో నరేషన్‌

రేటింగ్‌: 2/5