`స‌ర్కార్‌` సినిమా రివ్యూ
Spread the love

నిర్మాణ సంస్థ‌: స‌న్ పిక్చ‌ర్స్‌

తారాగ‌ణం: విజ‌య్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, యోగిబాబు, రాధార‌వి త‌దిత‌రులు

మాట‌లు: శ్రీరామ‌కృష్ణ‌

పాటలు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి

సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

ఛాయాగ్ర‌హ‌ణం: గిరీశ్ గంగాధ‌ర‌న్‌

కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌

నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌

ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌

కోలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న విజయ్‌ తెలుగులో మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. సూర్య, విశాల్‌, కార్తీ లాంటి హీరోలు తెలుగునాట కూడా మంచి మార్కెట్ సాధించినా విజయ్ మాత్రం ఇంత వరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. స‌ర్కార్ సినిమాలో కూడా ఓటు విలువ‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. మాస్ ఇమేజ్ ఉన్న హీరో విజ‌య్‌ను ఓ బిజిన‌స్ టైకూన్‌గా చూపిస్తూనే ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన నాయ‌కుడిని ఎన్నుకోవాలి అనే పాయింట్‌లో క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్‌. విజ‌య్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన స‌ర్కార్ త‌న‌కు ఎలాంటి విజ‌యాన్ని అందించిందో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం…

క‌థ‌:

సుంద‌ర రామ‌స్వామి(విజ‌య్‌) హైద‌రాబాద్‌కి చెందిన వ్య‌క్తి. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ అయిన జి.ఎల్ కార్పొరేట్ కంపెనీకి సి.ఇ.ఒగా వ‌ర్క్ చేస్తుంటారు. ఇత‌ని వ‌దిన చెల్లెలు లీలా (కీర్తి సురేశ్‌)కి సుంద‌ర్ అంటే ఇష్టం. కానీ రెండు కుటుంబాల‌కు ప‌డ‌వు. అలాంటి స‌మ‌యంలో సుంద‌ర్ త‌న ఓటు వేయ‌డానికి ఇండియా వ‌స్తాడు. కానీ ఎవ‌రో అత‌ని ఓటుని దొంగ ఓటు వేసేసి ఉంటారు. దాంతో సుంద‌ర్‌కి కోపం వ‌చ్చి త‌న ఓటు కోసం కోర్టుకి వెళ‌తాడు. 49 పి. సెక్ష‌న్ క్రింద బ్యాలెట్ ఓటును సంపాదించుకుంటాడు. అదే స‌మ‌యంలో అధికార పార్టీకి చెందిన నాయ‌కుడు(రాధా ర‌వి) సుంద‌ర్‌ని అవ‌మానిస్తాడు. దాంతో సుంద‌ర్ దొంగ ఓటుతో ఓటు వేసే అధికారాన్ని కోల్పోయిన వారిని రెచ్చ‌గొడ‌తాడు. దాంతో అంద‌రూ త‌మ‌కు 49 పి సెక్ష‌న్ క్రింద ఓటు హ‌క్కు కావాల‌ని కోర్టుకెక్కుతారు. కార్పోరేట్ క్రిమినల్‌గా పేరు తెచ్చుకున్న సుందర్‌ ఇక్కడి కరుడు గట్టిన రాజకీయనాయకులతోఎలా పోరాడాడు? పోటికి దిగిన సుందర్‌కు ఎదురైన సమస్యలేంటి.? అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌:

అదీగాక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ.. విజ‌య్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌నే వార్త‌లు విన‌ప‌డుతూ ఉండ‌టంతో సినిమా ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి అంద‌రిలో మొద‌లైంది. మ‌రో విష‌య‌మేమంఏ ఎప్ప‌టిలాగానే ముర‌గ‌దాస్ రాసుకున్న క‌థ నాదంటూ ఓ ర‌చ‌యిత‌(రాజేంద్ర‌న్‌) కేసు వేయ‌డం.. దీనిపై పెద్ద రాద్ధాంతం జ‌రిగింది. చివ‌ర‌కు స‌మ‌స్య ఎలాగో స‌ద్దుమ‌ణిగింది. తుపాకి ప‌క్కా థ్రిల్ల‌ర్‌గా ఉండ‌టంతో స‌క్సెస్ అయ్యింది. కత్తి సినిమా ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో స‌క్సెస్ అయ్యింది. కానీ ఈ సినిమా విష‌యంలో అది ఫెయిల్ అయ్యింది. ముర‌గ‌దాస్ 49 పి అనే పాయింట్ ఆధారంగా క‌థ‌ను రాసుకున్నాడు.

స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లుచుకోలేక‌పోయారు. విజ‌య్ క్యారెక్ట‌ర్‌కున్న బిల్డ‌ప్‌కి, సన్నివేశాల‌కు, క‌థాగ‌మనానికి సంబంధం క‌న‌ప‌డ‌దు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ఏదో మేజిక్ చేస్తాడు ముర‌గ‌దాస్ అని న‌మ్ముకున్న ఆడియెన్స్‌కు నిరాశే ఎదురైంది. విజ‌య్ ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యే పాయింట్ సినిమా స‌గంలోని ప‌క్క‌దారి ప‌ట్టేసింది. అన్నింటికి రాజ‌కీయాలే కార‌ణం అనే రీతిలో సినిమా సాగిపోతుందంతే. గిరీశ్ గంగాధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. భారీ బడ్జెట్ సినిమా కావటంతో క్వాలిటీ పరంగా వంక పెట్టడానికి లేదు. ఆర్ట్, సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చాయి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సీన్స్‌ నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడతాయి.

ప్ల‌స్ పాయింట్స్‌:

విజ‌య్‌

సినిమాటోగ్ర‌ఫీ

నేపథ్య సంగీతం

మైన‌స్ పాయింట్స్‌:

సినిమాలో స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేక‌పోవ‌డం

స్లో నేరేషన్‌

రేటింగ్‌:2/5