‘సాక్ష్యం’ మూవీ రివ్యూ
Spread the love

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, తదితరులు

కళ: ఏ.ఎస్.ప్రకాష్

ఛాయాగ్ర‌హ‌ణం: ఆర్ధర్ ఎ.విల్సన్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

సంగీతం: హర్షవర్ధన్

నిర్మాత: అభిషేక్ నామా

దర్శకత్వం: శ్రీవాస్

సంస్థ‌: అభిషేక్ పిక్చర్స్

క‌థానాయ‌కుడిగా బ‌ల‌మైన పునాదులు వేసుకొన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. తొలి చిత్ర‌మే మంచి వ‌సూళ్లు సాధించింది. ఆ త‌ర్వాత ప్ర‌తి సినిమాకీ త‌న మార్కెట్ స్థాయిని పెంచుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇలాంటి త‌రుణంలో హీరోలంద‌రూ కొత్త త‌ర‌హా సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అలాంటి ఆస‌క్తితో.. ముందు మూడు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేసిన కొత్త ప్ర‌య‌త్నం `సాక్ష్యం`. సృష్టిలో జ‌రిగేదానికి నాలుగు దిక్కులే కాదు. ఈ సినిమాతో భారీ యాక్షన్‌ చిత్రాలను కూడా డీల్‌ చేయగలనని ప్రూవ్‌ చేసుకున్నాడా..?

క‌థ:

రాజావారి కుటుంబం(శరతకుమార్‌ ఫ్యామిలీ)తనకు అడ్డు వస్తోందని మునుస్వామి సోదరులు(జగపతిబాబు బ్రదర్స్‌) ఆ కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తారు. ఇది సహించలేని మునుస్వామి మొత్తం రాజుగారి కుటుంబాన్ని చంపేస్తాడు. రాజుగారి భార్య తన కొడుకును ఓ లేగ దూడకు కట్టి తప్పిస్తుంది. అయితే రాజుగారికి పుట్టిన కొడుకుని ఎద్దు కాపాడ‌టంతో త‌ప్పించుకుంటాడు. కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్ర‌కాశ్‌(జ‌య‌ప్ర‌కాశ్‌) చెంత‌కు చేరుతాడు. పిల్ల‌లు లేని శివ ప్ర‌కాశ్ ఆ పిల్లాడికి విశ్వ‌జ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు. పెరిగి పెద్ద‌యిన విశ్వ వీడియో గేమింగ్‌ల‌ను ప్లాన్ చేసి చిత్రీక‌రిస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో సౌంద‌ర్య‌ల‌హ‌రి(పూజా హెగ్డే)ని చూసి ప్రేమిస్తాడు విశ్వ‌.

ఇండియన్‌ ట్రెడిషన్ పై తాను చేసే ఓ వీడియో గేమ్‌ కు సాయం చేయమని సౌందర్యను అడుగుతాడు. సౌందర్య.. వాల్మీకి (అనంత శ్రీరామ్‌) అనే వ్యక్తిని విశ్వకు పరిచయం చేస్తుంది. వాల్మీకి పంచభూతాల నేపథ్యంలో ఓ రివేంజ్‌ డ్రామా కాన్సెప్ట్‌ చెప్తాడు. దానికి విశ్వ ప‌రోక్షంగా కార‌ణ‌మ‌వుతాడు. అలాగే మున‌స్వామి ఇద్ద‌రు త‌మ్ముళ్లు కూడా విశ్వ చేతిలోనే చ‌స్తారు. అస‌లు మున‌స్వామి అండ్ బ్ర‌ద‌ర్స్‌పై ప్ర‌కృతి ఎందుకు కోపం తెచ్చుకుంటుంది? చివ‌ర‌కు మున‌స్వామి ప‌రిస్థితేంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ ;

పగ, ప్రతీకారాల నేపథ్యంలో వచ్చిన సినిమాలను చాలానే చూశాం. అయితే, దానికి ఓ కొత్త నేపథ్యం ఎంచుకోవడంలోనే విజయం దాగుంది. కథానాయకుడు తన తల్లిదండ్రులను చంపిన వారిని ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ చంపాడు అనే పాయింట్‌ చాలా బలహీనంగానూ, రొటీన్‌గానూ కనిపిస్తుంది. మంచి చెడుల‌ను బేరీజు వేసి పాపాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తాడు. మ‌నిషి ధ‌ర్మాన్ని పాటించాలి అని చెప్పే సినిమా ఇది. మామూలుగా ఇలాంటి సినిమా చేస్తే ఆధ్యాత్మిక సినిమా అవుతుంది. అయితే ఈ సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మేళ‌వించి, నేటి ట్రెండ్‌లో అంద‌రికీ అర్థ‌మ‌య్యే వీడియో గేమ్ రూపంలో క‌థ‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఒక మ‌నిషి రాసే స‌న్నివేశాలు..

అయితే అనాథ పిల్ల‌ల‌ను క్వారీలో ఉంచ‌డం వంటివి కొన్ని నాట‌కీయంగా అనిపించాయి. అయినా సినిమా క‌థ‌లో ఎక్క‌డా క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా తెర‌కెక్కించారు. దేవుడు, శ‌క్తి, న‌మ్మ‌కం, ప‌శు ప‌క్ష్యాదులు కూడా స‌త్సంక‌ల్పానికి సాయం చేయ‌డం అనే కాన్సెప్ట్ బావుంది. అయితే, మధ్యమధ్యలో సినిమాను మరింత కమర్షియల్‌ చేయడానికి పాటలను ఇరికించాడేమో అనిపిస్తుంది. సందర్భం ఏదైనా, ఒక ఫాస్ట్‌ బీట్‌ పాటను పెట్టడం వల్ల కథకు సడెన్‌ బ్రేకులు పడినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు ఊహించినట్లు సాగినప్పటికీ మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. మొత్తంగా చెప్పాలంటే, ఒక సగటు కథను, ఒక కొత్త నేపథ్యం ఎంచుకుని, భారీ హంగులు జోడించి, తెరకెక్కించడంలో దర్శక-నిర్మాతలు సఫలీకృతమయ్యారు.

ప్ల‌స్ పాయింట్లు

రీరికార్డింగ్‌

డైలాగులు

ప్రొడ‌క్షన్ వాల్యూస్‌

మైన‌స్ పాయింట్లు

అక్క‌డ‌క్క‌డా క‌న్‌ఫ్యూజన్‌

రేటింగ్‌: 2.75/5