‘రంగు’ మూవీ రివ్యూ
Spread the love

తారాగణం : తనీష్‌‌, ప్రియా సింగ్‌, పరుచూరి రవి, షఫీ, పోసాని కృష్ణమురళి, పరుచూరి వెంకటేశ్వర్రావు తదితరులు

సంగీతం : యోగేశ్వర్‌ శర్మ

దర్శకత్వం : కార్తికేయ

నిర్మాత : పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్నాయుడు

బాల నటుడిగా.. హీరోగా 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన తనీష్‌కి ఇప్పటి వరకూ సరైన హిట్ పడలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో ఫైనల్‌కి చేరడంతో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ.. బెజవాడ రౌడీ షీటర్ లారా వాస్తవ జీవిత కథతో ‘రంగు’ సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రంగు చిత్రం.. తనీష్‌ను హీరోగా నిలబెట్టిందా?.. అసలు ‘రంగు’ వెనుక కథేంటి? అన్నది ఓసారి చూద్దాం..

కథ :

పవన్ కుమార్ అలియాస్ లారా (తనీష్) తెలివైన మధ్య తరగతి యువకుడు. ఇంటర్‌లో స్టేట్ సెకండ్ ర్యాంగ్ సాధించి విజయవాడ డిగ్రీ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. స్వతాహాగా కోప స్వభావి అయిన లారా కాలేజ్‌లో సీనియర్ చేసే ర్యాగింగ్‌పై తిరగబడతాడు. జూనియర్స్ గ్రూప్‌కి నాయకత్వం వహిస్తూ.. గొడవలు, కొట్లాటలతో కాలేజ్ వాతావరణాన్ని రణరంగంగా మార్చేస్తాడు. ఎగ్జామ్స్ దగ్గర పడటంతో రెండు గ్రూపుల మధ్య సంధి చేసుకుని గొడవలకు ఫుల్ స్టాప్ పెడతారు. ఈ గొడవల మధ్యే తనకు పూర్ణ (ప్రియా సింగ్‌) అనే అమ్మాయితో ప్రేమా తరువాత పెళ్లి జరుగిపోతాయి. దీంతో జీవితంపై ఇష్టం ఏర్పడుతుంది. మళ్లీ మాములు మనిషిలా మారాలానుకుంటాడు. మరి అనుకున్నట్టుగా లారా మంచి వాడిగా మారిపోయాడా..? ఈ ప్రయత్నంలో లారాకు ఎదురైన సమస్యలేంటి..? ఈ కథలో ఏసీపీ రాజేంద్రన్ (‌పరుచూరి రవి), మణి (షఫీ)ల పాత్ర ఏంటీ? అసలు చివరకు ఏమైంది.. అనేదే ‘రంగు’ కథ.

విశ్లేషణ :

ఇంతలో లారా స్నేహితుడు ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించడంతో పెద్దల్ని ఎదిరించి రిజిష్టర్ ఆఫీస్‌లో పెళ్లి జరిపిస్తాడు లారా. దీంతో స్థానిక ఎస్ ఐ చక్రవర్తి లంచం తీసుకుని లారాని అరెస్ట్ చేసి అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు. అయితే లారాని బెజవాడలో ఎమ్మెల్యే వీరభద్రం అండదండలతో రౌడీ షీటర్ సైరన్.. లారా ఎదుగుదలను అడ్డుకుని అతన్ని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తారు. బెజవాడలో రౌడీఇజం పెరిగిపోవడంతో వాళ్ల ఆగడాలను అరికట్టేందుకు సిటీకి కొత్తగా ఏసీపీ రాజేంద్ర(పరుచూరి రవి) వస్తారు. సిటీలో ఉన్న రౌడీలందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తారు. రౌడీలపై ఉక్కుపాదం మోపుతాడు. అయితే తన సెటిల్‌మెంట్స్‌కి ఏసీపీ అడ్డుతగలడంతో లారా ఏసీపీతో విభేదిస్తాడు. దీంతో లారాని ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్లాన్ చేస్తారు పోలీసులు. అక్కడ నుండి తప్పించుకున్న లారా.. పూర్ణ తనపై చూపిస్తున్న ప్రేమను తెలుసుకుని పూర్తిగా మారిపోయి ఆమెను పెళ్లి చేసుకుని ఓ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరతాడు.

కానీ రంగు విషయంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నా కూడా.. వాటిని దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తుంది. ఈ కథకు పరుచూరి బ్రదర్స్‌ మాటలు రాయడం ప్లస్‌ పాయింట్‌. వారి మాటలు మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా అదే సమయంలో ఆలోచింపచేసేలా ఉన్నాయి. యోగేశ్వర్‌ శర్మ అందించిన సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.

నటీనటులు :

హీరోయిన్‌గా నటించిన ప్రియాసింగ్ తన పాత్ర పరిధి మేర బాగానే నటించింది. చివర్లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ పండించగలిగింది. ఇక దర్శకుడు కార్తికేయ వి. బెజవాడ రౌడీ షీటర్ వాస్తవ కథను తెరపై చూపించే ప్రయత్నంలో మార్చులు చేర్పులతో కథను కిచిడీ చేసేశారు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఒకే రకమైన ఫ్లోలో వెళ్లిపోతూ కథను ఆసక్తికరంగా మలచలేకపోయారు. నటుడిగా అతను ఇంకా బిజీ అయ్యే అవకాశం ఉంది. రౌడీయిజం వదిలేసి సాధుజీవిలో బతుకుతున్న పాత్రలో షఫీ నటన బాగుంది. పూర్ణ తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, పరుచూరి వెంకటేశ్వర్రావు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.

రేటింగ్: 2.25