‘రాజు గాడు’ రివ్యూ
Spread the love

నటీనటులు: రాజ్‌తరుణ్‌, అమైరా దస్తూర్‌, రాజేంద్రప్రసాద్‌, నాగినీడు, ప్రవీణ్‌, సితార తదితరులు

సంగీత దర్శకుడు: గోపీ సుందర్‌

నిర్మాత: అనిల్‌ సుంకర

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజనా రెడ్డి

ఉయ్యాల జంపాలా’ చిత్రంతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. కానీ కొంతకాలంగా ఆయన సినిమాలేవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. రాజ్ తరుణ్ నటనతో పాటు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరి విభిన్నంగా, ఈ తరం యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం అతడి ప్లస్ పాయింట్స్. తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్. తర్వాత వరుస ప్లాపులతో వెనకపడిపోయాడు.

Rajugadu కథ:

రాజు (రాజ్ తరుణ్) చిన్నప్పటినుండి నుండి క్లెప్టోమేనియా అనే వింత జబ్బుతో బాధ పడుతుంటాడు. ఈ వ్యాధి లక్షణం తమకు తెలియకుండానే దొంగతనం చేయడం. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం ఉండదు. రాజుతో పాటు దొంగతనం చేసే అలవాటు కూడా పెరుగుతుంటుంది. ఒకరోజు హీరోయిన్ తన్విని (అమైరా దస్తూర్) చూసి మొదటి చూపులోనే ప్రేమపడుతాడు రాజు. తన్వి కూడా రాజుని ఇష్టపడుతుంది. కాకపోతే పది రోజుల పాటు రాజు..తన్వి తాతగారు (నాగినీడు) ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నాగినీడుకి దొంగలంటే ఇష్టముండదు. ఆ ఊర్లో ఎవరు దొంగతనం చేసినా చేతులు నరికేస్తుంటాడు. అలాంటి ఇంట్లో తానో దొంగ అని తెలీకుండా రాజు ఏం చేశాడు? ఆ ఇంట్లో వారి మనసులను ఎలా గెలుచుకున్నాడు? తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అన్నదే కథ.

విశ్లేష‌ణ‌:

ఓ కాన్సెప్ట్ ప్ర‌కారం న‌డిచే క‌థ ఇది. కాబ‌ట్టి లాజిక్కులు గురించి ప‌ట్టించుకోకూడ‌దు. కాన్సెప్టే బ‌లం. కాబ‌ట్టి అది ఎలా ఉన్నా స‌రే – స్వీక‌రించాల్సిందే. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు కూడా చిన్న చిన్న కాన్సెప్టులే. అవి విజ‌యం సాధించాయి క‌దా? క్లెప్టోమేనియా పాయింట్‌ని కూడా స‌రిగా డీల్ చేయొచ్చు. అందులోంచి బోలెడంత వినోదం పిండొచ్చు. కానీ… ద‌ర్శ‌కురాలిలో ఆ స‌త్తా ఉండాలి. దుర‌దృష్టం ఏమిటంటే… ఆ ప్ర‌తిభ సంజ‌న‌లో క‌నిపించ‌లేదు. ఇదే క‌థ‌ని మారుతి అయితే ఎలా ట్రీట్ చేసుంటాడో తెలీదు గానీ – సంజ‌న మాత్రం న్యాయం చేయ‌లేక‌పోయింది. అయితే ఈ సినిమాలో మాత్రం కామెడీ ఆశించిన స్థాయిలో దొరకదు. ఫస్ట్ హాఫ్ రెండు కామెడీ సన్నివేశాలు ఓ లవ్ ట్రాక్ అంటూ రొటీన్‌గా సాగిపోతుంది. హీరో పాత్ర గ్రామంలో ఎంటర్ అయినప్పటి నుండి కామెడీ మళ్లీ పుంజుకుంటుంది.

Rajugadu

ఇక సినిమాకు హైలైట్‌గా నిలిచింది రాజేంద్రప్రసాద్ నటన. హీరో తండ్రిగా అతడు చేసిన పెర్ఫార్మన్స్‌ను మెచ్చుకొని తీరాలి. అతడి బాడీ లాంగ్వేజ్, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హీరోయిన్ అమైరా దస్తూర్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇచ్చినప్పటికీ.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ పెద్దగా ఆకట్టుకోదు. నాగినీడు, రావు రమేష్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాజ్‌తరుణ్‌లో ప్రేక్షకుడికి నచ్చేదే ఎనర్జీ. ఎలాంటి పాత్రైనా ఎంతో ఉత్సాహంతో చేస్తాడు. కానీ ఆ హుషారు ఈ సినిమాలో కన్పించలేదు. ఇందులో రాజ్‌ తరుణ్‌ చాలా డల్‌గా కనిపిస్తాడు. అతని చుట్టూ ఉన్న పాత్రలు కూడా వినోదాన్ని పండించలేకపోయాయి.

డైరెక్టర్‌గా సంజనాకు మొదటి సినిమా కావడంతో ఎంటర్టైన్మెంట్‌తో ఉన్న కథను రాసుకున్నారు. కానీ ఆ కథను ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించలేకపోయారు. అక్కడక్కడా కామెడీ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏంలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందించారు. ‘క్లెప్టోమేనియా’ అనే రోగం కాస్త కొత్త కనిపించినప్పటికీ.. మంచి కామెడీ ఎంటర్టైనర్ అనుకొని సినిమాకు వెళ్లే ప్రేక్షకుల్ని ‘రాజుగాడు’ నిరాశ పరిచాడు.

న‌టీన‌టులు:

రాజ్ త‌రుణ్ మంచి న‌టుడే. కానీ ఈమ‌ధ్య మ‌రీ పేల‌వ‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటున్నాడు. న‌ట‌న‌లోనూ మెరుపులు లేవు. ఇది వ‌ర‌క‌టితో పోలిస్తే… అత‌ని హుషారు త‌గ్గిపోయింది. బ‌హుశా పాత్ర‌ని స‌రిగా డీల్ చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్లేమో. రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి న‌టుడు ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తే అస్స‌లు చూడ‌లేం. దొంగతనాలు చేసే కొడుకుతో కాస్త కామెడీ క్యారెక్టర్ ఉన్న పాత్రలో రాజేంద్రప్రసాద్ మెప్పించాడు. సీరియస్ పాత్రలో నాగినీడు తన పరిధిమేర నటించాడు. విలన్ పాత్ర రావు రమేష్ చేశాడు కానీఅతడి పెర్ఫార్మెన్స్‌ను ఎలివేట్ చేసే సీన్లయితే పడలేదు. సితార, సుబ్బరాజు, 30 ఇయర్స్ పృధ్వి, రఘు, సుబ్బరాజు, కృష్ణ భగవాన్, ఖయ్యుం తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వ‌ర్గం :

చిన్న కాన్సెప్ట్‌కి బ‌లాన్నిచ్చేలా స‌న్నివేశాలు, సంఘ‌ట‌న‌లూ లేవు. ర‌చ‌యిత, ద‌ర్శ‌కురాలు ఇద్ద‌రూ దీనికి బాధ్యులే. పాట‌లు ఓకే అనిపిస్తాయి. మాట‌లు స‌రిగా పేల‌లేదు. ఇలాంటి సినిమాల్ని హిలేరియ‌స్‌గా తీర్చిదిద్దాలి. అలాంటి ఎపిసోడ్ ఒక్క‌టీ ఈసినిమాలో క‌నిపించ‌దు

రేటింగ్: 2/5