ఆఫీసర్ సినిమా రివ్యూ
Spread the love

నటీనటులు: నాగార్జున, మైరా శరీన్‌, ఫెరోజ్‌ అబ్బాసీ, షాయాజీ షిండే, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌, ప్రియదర్శి, బేబీ కావ్య తదితరులు

సంగీతం: రవి శంకర్‌

సినిమాటోగ్రఫీ: ఎన్‌. భరత్‌ వ్యాస్‌, రాహుల్‌ పెనుమత్స

ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ, ఆర్‌.కమల్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ

బ్యానర్‌: ఆర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌

కింగ్ నాగార్జున – ఆర్జీవీ క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఆఫీసర్’ చిత్రం భారీ అంచనాల నడుమ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవితం ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఆఫీసర్’ చిత్రాన్ని రూపొందించారు వర్మ. నాగార్జున- రాంగోపాల్‌వర్మ కాంబినేషన్‌ అంటే అందరికీ గుర్తొచ్చే చిత్రం ‘శివ’. ఈ సినిమా తర్వాత హీరోగా నాగార్జున ఎన్ని సినిమాలైనా చేసి ఉండొచ్చు. అలాగే వర్మ చాలా చిత్రాలకు దర్శకత్వం వహించి ఉండొచ్చు. కానీ, వీరి గురించి చెప్పాల్సి వస్తే ‘శివ’ గురించి ప్రస్తావించకుండా మాట్లాడలేం. మరి అలాంటి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ప్రేక్షకులు కాస్త ఎక్కువే ఆశిస్తారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఆఫీసర్‌’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆఫీసర్‌’ ఎలా ఉన్నాడు?

కథ:

నారాయణ్ పసారి (అన్వర్ ఖాన్) ముంబైలో పేరున్న పోలీస్ ఆఫీసర్. డిపార్ట్మెంట్‌లో అతడికి మంచి పేరున్నప్పటికీ ఆయన చేసే పనులన్నీ కూడా అక్రమాలే. ఓ కేసు విషయంలో అతడిపై విచారణ జరిపించాలని కోర్టు నిర్ణయించుకుంటుంది. దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను సిద్ధం చేస్తుంది. దీనికి చీఫ్‌గా హైదరాబాద్‌కు చెందిన శివాజీ రావు (నాగార్జున)ని నియమిస్తుంది. దీంతో శివాజీ రాబు ముంబైకి వెళ్లి నారాయణ్ పసారిపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు శివాజీ విచారణలో అది బూటకమని తేలుతుంది. దాంతో శివాజీపై కక్ష పెంచుకుంటాడు నారాయణ పసారి. శివాజీరావు బృందాన్ని నారాయణ పసారి ఎలా టార్గెట్‌ చేశాడు? ముంబయిలో శివాజికీ, నారాయణ పసారికీ జరిగిన సంఘర్షణ ఏంటి? అన్నదే ‘ఆఫీసర్‌’ కథ.

విశ్లేషణ:

కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చెప్పారు. సౌత్ నుండి ముంబైకి వెళ్లిన పోలీస్ మరొక పోలీస్ చేసే క్రిమినల్ చర్యలకు ఎలా అడ్డుపడ్డాడనేదే ఈ సినిమా. సింపుల్ లైన్‌ను సాగదీసి రెండు గంటల సినిమా చేశాడు వర్మ. కథలో ఈ సీన్ ఇంటరెస్టింగ్‌గా ఉందే అనుకునేలోపు గాలి తీసేస్తుంటాడు. సినిమా మొత్తం కూడా ఇలానే ఉంటుంది. ఈ సినిమాకు సౌండ్ ఎఫెక్ట్స్ మాములుగా ఉండవని చిత్రబృందం తెగ ప్రమోట్ చేసింది. మాఫియా, అండర్‌వరల్డ్‌, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన కథను బాగా డీల్‌ చేయగలగడం రాంగోపాల్‌వర్మకు ఉన్న ప్రధాన బలం. ఈ మూడు అంశాలు ఇందులో ఉండేలా చూసుకున్నాడు వర్మ. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఈ కథను మొదలు పెట్టాడు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇన్వెస్టిగేషన్‌ ఎలా సాగుతుంది? డిపార్ట్‌మెంట్‌ లోపల తతంగం ఏంటి? అన్న విషయాలను బాగా పరిశీలించిన వర్మ

సామాన్య ప్రేక్షకుడికి, రొటీన్‌ సినిమాలు చూసేవాళ్లకు ఈ తరహా కథ, కథనాలు సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. తొలి సగంలో శివాజీరావు చేసే ఇన్వెస్టిగేషన్‌ చాలా పకడ్బందీగా సాగడంతో వర్మ మళ్లీ ట్రాక్‌ ఎక్కాడనిపిస్తుంది. సాంకేతికంగా తన పట్టు చూపించడంలో వర్మ సఫలమయ్యాడు. అయితే, ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవదు. ద్వితీయార్ధం మొదలవగానే మళ్లీ ఇప్పటి వర్మ బయటకొస్తాడు. హీరో-విలన్ల మధ్య రొటీన్‌ రివెంజ్‌ డ్రామా నడిపి ఈ కథను ఓ సగటు కథగా మార్చేశాడు. ద్వితీయార్ధంలో ఛేజింగ్‌లు, ఫైట్లకే పరిమితమైన వర్మ.. సినిమా ప్రారంభంలో ప్రేక్షకుడిలో కలిగించిన ఆసక్తిని క్రమంగా తగ్గించుకొంటూ వెళ్లిపోయాడు.

నటుడిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆయనకున్న అనుభవంతో శివాజీరావు పాత్రను రక్తి కట్టించాడు. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. విలన్ పాత్రను బలంగా రాసుకున్నప్పటికీ తెరపై ఆ పాత్ర పండలేడనే చెప్పాలి. అన్వర్ తన పేలవమైన పెర్ఫార్మన్స్‌తో విసిగించాడు. ఆ పాత్రలో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమున్న నటుడిని తీసుకొని ఉంటే బాగుండేది. మైరా సరీన్ కథకు ప్లస్ కాలేకపోయింది. బేబీ కావ్య తన వయసుకి మించిన ప్రదర్శన చేసింది. టెక్నికల్‌గా వర్మ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కెమెరా వర్క్ ఆయన దగ్గరుండి చేసుకొని ఉంటారు. ప్రతి ఫ్రేమ్‌లో వర్మ పనితనం క్లియర్‌గా కనిపిస్తుంది. సంగీతం ఏమంత ఆకట్టుకోదు. నేపధ్య సంగీతం వర్మ తన సినిమాల నుండే కాపీ చేయించి పెట్టుకున్నట్లుగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగాలేదు. వర్మ సొంత నిర్మాణం కావడంతో అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేసేశారు. వర్మ సినిమాలు ఇష్టపడే వీరాభిమానులు సైతం చూడడానికి కష్టంగా ఉండే ‘ఆఫీసర్’ మరి కలెక్షన్స్ పరంగా ఎలాంటి నెంబర్స్‌ను చూపిస్తుందో చూడాలి.

బలాలు

నాగార్జున

ఫిరోజ్ అబ్బాసి యాక్టింగ్

ప్రథమార్ధం

సినిమాటోగ్రఫీ

సౌండింగ్‌

బలహీనతలు

ద్వితీయార్ధం

నిర్మాణ విలువలు

రేటింగ్: 2/5