నన్ను దోచుకుందువటే
Spread the love

స‌మ‌ర్ప‌ణ‌: శ‌్రీమ‌తి రాణి పోసాని

నిర్మాణ సంస్థ‌: సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్‌

తారాగ‌ణం: సుధీర్‌బాబు, న‌భా న‌టేశ్‌, నాజ‌ర్‌, తుల‌సి, సుద‌ర్శ‌న్, పృథ్వీ, జీవా, వైవా హ‌ర్ష‌ త‌దిత‌రులు

సంగీతం: అజ‌నీశ్ లోక్‌నాథ్‌

ఛాయాగ్ర‌హ‌ణం: సురేశ్ ర‌గుతు

కూర్పు: ఛోటా కె.ప్ర‌సాద్‌

నిర్మాత : సుధీర్‌బాబు

ద‌ర్శ‌క‌త్వం : ఆర్‌.ఎస్‌.నాయుడు

సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో సుధీర్‌ బాబు తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ కోసం కష్టపడుతున్నాడు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన చార్మింగ్ హీరో మల్టీస్టారర్‌ సినిమాలతో పాటు ప్రతినాయక పాత్రలకు కూడా సై అంటున్నాడు. ఇప్పుడు సుధీర్ నుంచి వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ ప్రోమోలతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సుధీర్ నిర్మాత కూడా. ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ ;

కార్తీక్ (సుధీర్ బాబు) ఒక ఐటీ కంపెనీలో మేనేజర్. ఛండశాసనుడిలా కనిపించే కార్తీక్ అంటే అతడి టీంలోని వాళ్లందరికీ హడల్. పని తప్ప వేరే ధ్యాస లేదన్నట్లుగా అతడి జీవితం సాగుతుంటుంది. తన కుటుంబాన్ని కూడా అతను పట్టించుకోడు. ఇలాంటి స్థితిలో అతడికి మరదలితో పెళ్లి చేయాలని చూస్తాడు తండ్రి (నాజర్). మరదలు వేరే అబ్బాయితో ప్రేమలో ఉందని తెలిసి.. ఈ పెళ్లి తప్పించడానికి తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెబుతాడు కార్తీక్. కాలేజీలో చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేసే మేఘన (నభా నటేష్) కార్తీక్ తండ్రిని నమ్మించడానికి అతడి ప్రేయసిగా నటించడానికి ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో ఆమె కార్తీక్ కు దగ్గరవుతుంది. కార్తీక్ కూడా ఆమెను ఇష్టపడతాడు. కార్తీక్ తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నా మేఘనకు చెప్పలేకపోతాడు. చివరకు కార్తీక్ తను కలగన్నట్టుగానే అమెరికా వెళ్లిపోయాడా..? లేదంటే మేఘన ప్రేమను పొందాడా? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ ;

నన్ను దోచుకుందువటే’ సింపుల్ గా సాగిపోయే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. కథ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ కనిపించదు. అనుకోకుండా పరిచయమై ప్రేమలో పడే ఒక జంట.. వారి మధ్య అపార్థాలు.. ఆపై ఇద్దరూ కలిసిపోయే ఒక సగటు కథతోనే ఇది తెరకెక్కింది. ఐతే కొత్త దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు ఈ ప్రెడిక్టబుల్ స్టోరీని ఉన్నంతలో ఆసక్తికరంగానే చెప్పాడు. చదువు, ఉద్యోగం, కెరీర్లో ఎదగడం.. ఇవి తప్ప నేటి యువతకు మరేది పట్టడం లేదు. కెరీర్ గ్రోత్ అంటూ మెకానికల్‌గా బతికేస్తున్నారు. సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఈ సమస్యకు కాస్త ప్రేమ, ఫ్యామిలీ డ్రామాను కలిపి దర్శకుడు ‘నన్ను దోచుకుందువటే’ను తెరకెక్కించారు.

మరదలితో పెళ్లి చేస్తామని కార్తీక్‌కు ఇంట్లో వాళ్లు చెప్తారు. కానీ ఆమె వేరే అబ్బాయిని ప్రేమించానని చెప్పడంతో కార్తీక్ సిరి గురించి నాన్నకు చెప్తాడు. ఆమెను చూసేందుకు నాజర్ హైదరాబాద్ రావడం, ఆమెతో బాగా కలిసిపోవడం.. కార్తీక్‌ కూడా ఆమెను ఇష్టపడటంతో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ ముందు నిన్ను కలవడం కుదరదని హీరో ట్విస్ట్ ఇస్తాడు. హీరోహీరోయిన్లు, వైవా హర్ష మధ్య వచ్చే కామెడీ సీన్ సినిమా మొత్తానికే హైలెట్. సుధీర్ బాబు తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు.

నటీనటులు ;

సుధీర్‌ బాబు నిర్మాతగా మారేందుకు పర్ఫెక్ట్‌గా తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథను ఎంచుకున్నాడు. తన ఇమేజ్‌కు తగ్గట్టుగా రొమాంటిక్‌ కామెడీతో అలరించాడు. తాను సీరియస్‌గా ఉంటూనే ఆడియన్స్‌ను నవ్వించటంలో సక్సెస్‌ సాధించాడు. షార్ట్ ఫిలింలో నటించే నటించే సీన్లో అతడి నటన బాగా నవ్విస్తుంది. హీరోయిన్ నభా నటేష్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. తెలుగులో తొలి సినిమా అయినా.. ఏ తడబాటూ లేకుండా కాన్ఫిడెంటుగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. పాత్ర కూడా బాగుండటంతో నభా ప్రేక్షకులపై బలమైన ముద్రే వేస్తుంది. మధ్యలో వదిలేశారు కానీ.. ఈ పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్ది ఉండొచ్చు. నాజర్ కనిపించేది తక్కువ సన్నివేశాల్లోనే అయినా తన అనుభవం చూపించారు.

సాంకేతిక వర్గం:

కంటెంట్ పరంగా జస్ట్ ఓకే అనిపించే సినిమాల్లో పాటలు బాగుండటం చాలా అవసరం. కానీ ‘నన్ను దోచుకుందువటే’కు మ్యూజిక్ బలం కాలేకపోయింది. ఇలాంటి రొమాంటిక్ కామెడీలకు తగ్గ సంగీతాన్ని అజనీష్ లోక్ నాథ్ సమకూర్చలేకపోయాడు. పాటలు మామూలుగా అనిపిస్తాయి. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగున్నా.. కొన్ని చోట్ల మరీ లౌడ్ గా అనిపిస్తుంది. ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీలవకుండా చేయడంలో దాదాపు సఫలమయ్యారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ సుధీర్ బాబు మెప్పించారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.

బ‌లాలు:

ప్ర‌థ‌మార్థం

నాయ‌కానాయిక‌ల హాస్యం

కెమెరా వ‌ర్క్‌

బ‌ల‌హీన‌త‌లు

హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను చూస్తుంటే.. బొమ్మ‌రిల్లు హాసిని పాత్ర గుర్తుకు వ‌చ్చింది

సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

చివ‌రిగా: మ‌న‌సులు దోచుకుంటారు

నన్ను దోచుకుందువటే

రేటింగ్‌: 2.5