కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ: నేచురల్ స్టార్ నాని
Spread the love

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రతీ సినిమాకు కలెక్షన్లపరంగానే కాకుండా నటనపరంగా పైచేయి సాధిస్తున్నారు నాని. మజ్ను, నిన్నుకోరి, ఎంసీఏ చిత్రాలు నాని ప్రతిభకు, స్టామినాకు అద్దం పట్టాయి. విభిన్నమైన చిత్రాల ఎంపికతో తన మార్కును సొంతం చేసుకొంటున్నారు. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో నాని నటించిన తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రం ద్వారా మరోసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనుపమ పరమేశ్వరన్, రుస్కర్ మీర్ నటించిన టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇదొక అరుదైన రికార్డు అవుతుంది. అలాంటి అరుదైన రికార్డు కృష్ణార్జున యుద్ధం సినిమా సక్సెస్‌పై ఆధారపడింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, నానికి ఆ స్పెషల్ రికార్డును అందించిందా అనేది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కృష్ణార్జున యుద్ధం కథ:

కృష్ణ (నాని) చిత్తూరు జిల్లాలోని ఓ పల్లెటూరిలో పనీపాటా లేకుండా తిరిగే కుర్రాడు. చదువు సంధ్యలు పెద్దగా అబ్బకపోవడంతో వ్యవసాయ పనులు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటాడు, ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తూ.. అప్పులు తీర్చడం కోసం పొలాల్లో డప్పు వాయించే కుర్రాడు కృష్ణ (నాని). యూరప్‌లో పెద్ద పాప్ సింగర్ అర్జున్ జయప్రకాశ్ (నాని). కృష్ణ ఊరి సర్పంచ్ (నాగినీడు) మనవరాలు ప్రియా (రుక్సర్ థిల్లాన్ ) మీద మనసు పారేసుకుంటాడు. కొన్ని రోజుల పాటు కృష్ణతో కలిసి సాగాక రియా కూడా అతడిని ఇష్టపడుతుంది. రియా బాగా చదువుకొన్న అమ్మాయి కావడం, డబ్బున్న కుటుంబానికి చెందడంతో వారి ప్రేమకు పెద్దలు అంగీకారం లభించదు. ఐతే రియా తాతకు అది ఇష్టం లేక ఆమెను హైదరాబాద్ పంపించేస్తాడు. మరోవైపు రాక్ స్టార్ అయిన అర్జున్ (నాని) తన మ్యూజిక్ టూర్లో భాగంగా యూరోప్ వెళ్లి అక్కడ సుబ్బులక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) అనే తెలుగమ్మాయి ప్రేమలో పడతాడు. సుబ్బలక్ష్మిని తొలిచూపులోనే అర్జున్ ప్రేమిస్తాడు. కానీ అర్జున్ ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె అతడి ప్రేమను తిరస్కరించి హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకొంటుంది, కట్ చేస్తే, చిత్తూరు నుండి ప్రియా, యూరోప్ నుండి సుబ్బలక్ష్మి హైదరాబాద్ వచ్చి కిడ్నాప్ అవుతారు. వాళ్ళను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన కృష్ణ, అర్జున్ తమ గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఉమెన్ ట్రాఫికింగ్‌కి గురయ్యారని తెలుసుకుంటారు. ముఠా నుండి వాళ్ళిద్దరినీ విడిపించడానికి కృష్ణార్జునులు ఒక్కటవుతారు. హైదరాబాద్‌లో ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తోన్న గ్యాంగ్ ఎవరు..? చివరికి ఆ గ్యాంగ్ నుండి కృష్ణ-అర్జున్ వారిద్దరితో పాటు మిగతా వారిని ఎలా కాపాడగలిగారు

కథనం – విశ్లేషణ:

దర్శకుడు మేర్లపాక గాంధీ వేంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలలో కథకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం కామెడీనే నమ్ముకున్నాడు. అయితే మేర్లపాక అనుకున్నట్టుగా కామెడీకి పెద్ద పీట వేసి కథని నెగ్లెట్ చేసినా కొన్ని సినిమాలు అలా కామెడీతోనే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మేర్లపాక గత చిత్రాలు అంతే. రెండు సినిమాల్లో కామెడీ హైలెట్ కావడం. కథ గురించి పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంలోనూ మేర్లపాక తన గత చిత్రాల ఫార్ములానే పాటించాడు.

ఒక రొటీన్ కథని తీసుకుని కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఓ మోస్తరు పాత్రలిస్తేనే దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిపోయే నాని.. చిత్తూరు నేపథ్యంలో కొంచెం కొత్తగా.. ప్రత్యేకంగా అనిపించే కృష్ణ పాత్రలో చెలరేగిపోయాడు. చిత్తూరు పల్లెటూళ్ల నేటివిటీని యాసను.. అక్కడి పల్లెటూరి కుర్రాళ్ల మనస్తత్వాల్ని బాగానే అర్థం చేసుకుని కృష్ణ పాత్రను పండించాడు. ఈ పాత్రే సినిమా అంతా ఉంటే కథాకథనాల సంగతెలా ఉన్నా చెల్లిపోయేదేమో.

ఇక ఈ సినిమాలో నాని పాత్రకి సంబంధించి కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. ఏందిరా ఈడు.. సిగరెట్ యాడ్‌లో ద్రవిడ్‌లా సంబంధం లేకుండా ఏందేందో మాట్లాడుతున్నాడు’ , ‘చెప్పు మాత్రమే చూపించిందంటే.. ఆ పిల్ల ఊరికి కొత్త అనుకుంటాలాంటి డైలాగ్స్ బావున్నాయి. మరి నాని సినిమా కి యావరేజ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు మాత్రం హిట్ చేస్తారు. అలా నాని గత సినిమా ఎంసీఏ నిరూపించింది. ఇక ఇప్పుడు కృష్ణార్జున కూడా ఫస్ట్ హాఫ్ హైలెట్, సెకండ్ హాఫ్ డల్ అయినా.. నాని విషయం ప్రేక్షకుల నాడి ఎలా ఉంటుందో అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.

రాయలసీమ యాసలో నాని డైలాగ్:

ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు.ఇప్పటికే కృష్ణ, అర్జున్ పాత్రలను పరిచయం చేసిన నాని ఈరోజు సినిమాలో మాస్ పాటను విడుదల చేశారు. పాట మొదలయ్యే ముందు నాని.. పార్టీనా అని అంత మెల్లగా అడుగుతారేందిరా.. చిత్తూరు మొత్తం మన పలక శబ్దం వినపడాల.. స్టార్ట్ మ్యూజిక్అంటూ రాయలసీమ యాసలో డైలాగ్ చెప్పి మెప్పించాడు. దారి చూడు దమ్మూ చూడు మామఅంటూ సాగిన ఈ పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.

నటీనటుల:

నేచురల్ స్టార్ నాని అనే బిరుదు నాని కి పక్కాగా సరిపోతుంది అనే మాట మరోమారు రుజువైంది. భలే భలే మగాడివోయ్ సినిమాలో మతిమరుపున్న ప్రేమికుడిగా ఎంత చక్కటి నటన ప్రదర్శించాడో  నిన్ను కోరి సినిమాలో తన ప్రేమను దక్కించుకునే అబ్బాయి పాత్రలో అలాగే అదరగొట్టాడు. ఇక మిడిల్ క్లాస్ అబ్బాయి లో మిడిల్ క్లాస్ అబ్బాయిలా, తనవాడిన కోసం ప్రాణాలిచ్చే కుర్రాడిగా నాని నటన అద్భుతం. ఆ సినిమా కి యావరేజ్ టాక్ వచ్చినానాని కున్న క్రేజ్ తో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా కృష్ణార్జున యుద్ధం లో కూడా నాని పల్లెటూరి కుర్రాడు కృష్ణ గా అదర గొట్టేసాడు. పల్లెటూరి కుర్రాడు కృష్ణ పాత్రలాంటి పాత్రలు చెయ్యడం అనేది నాని కి కొట్టినపిండి. కృష్ణా పాత్రలో కామెడి పండించడానికి మంచి స్కోప్ ఉండడంతో నాని చెలరేగి పోయాడు. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులని తన కామెడీ టైమింగ్ తో హాయిగా నవ్వించాడు.

నాని. గెటప్.. బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ.. అన్నీ ఆకట్టుకుంటాయి. అర్జున్ పాత్రలో నాని చాలా మామూలుగా కనిపిస్తాడు. తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం లేకపోయింది. హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కనిపించినంతసేపు తన అందంతో – హావభావాలతో ఆకట్టుకుంటుంది. కానీ ఆమె పాత్ర పరిధి తక్కువ. మరో హీరోయిన్ రుక్సార్ దిల్లాన్ అందంగా ఉంది కానీ.. నటన పరంగా చెప్పుకోవడానికేమీ లేదు. కృష్ణ స్నేహితులుగా మహేష్.. సుదర్శన్ నవ్వించారు. బ్రహ్మాజీ కూడా ఆకట్టుకుంటాడు.

సాంకేతిక వర్గం:

హిప్ హాప్ తమిళ సంగీతం పాటలు ఆకట్టుకుంటాయి. ఒక కొత్త ఫీల్ ఇస్తాయి. ముఖ్యంగా దారి చూడు పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మిగతా పాటలు కూడా బాగున్నాయి. కానీ సినిమాలో.. ముఖ్యంగా ద్వితీయార్ధంలో పాటలు కథనానికి అడ్డం పడతాయి. హిప్ హాప్ నేపథ్య సంగీతం కూడా వైవిధ్యంగానే ఉంది కానీ.. కొన్ని చోట్ల అది మరీ లౌడ్ గా ఉండి సినిమాలో సింక్ అవ్వలేదనిపిస్తుంది.

ఛాయాగ్రహణం సినిమాకు మరో పెద్ద ఆకర్షణ. అటు యూరోప్ నేపథ్యం సాగే సన్నివేశాల్ని ఎంత రిచ్ గా తీశాడో.. ఇటు చిత్తూరు పల్లెటూరి నేటివిటీని అంత బాగా చూపించాడు. పల్లెటూరి వాతావరణాన్ని…. సాంగ్స్ పిక్చరైజేషన్ ఇలా అన్ని విషయాల్లో కార్తీ సినిమాటోగ్రఫీ అదరగొట్టేసింది.

చివరగా: కృష్ణార్జున యుద్ధం- వినోదం ఓకే.. యుద్ధమే తేలిపోయింది

రేటింగ్- 3 .0