కన్నుల్లో నీ రూపమే: రివ్యూ
Spread the love

తారాగ‌ణం: నందు, తేజస్విని ప్రకాష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీ, ఫిష్ వెంక‌ట్‌, కారుణ్య చౌద‌రి, చ‌లాకీ చంటి త‌దిత‌రులు

సంగీతం : సాకేత్ కోమండురి

ఛాయాగ్ర‌హ‌ణం: ఎన్‌.బి. విశ్వకాంత్ , సుభాష్ దొంతి

సమర్పణ: రాజమౌళి .ఇ

నిర్మాత: భాస్కర్ భాసాని

దర్శకత్వం: బిక్స్ ఇరుసడ్ల‌

సంస్థ‌: ఎ.ఎస్‌.పి. క్రియేటివ్స్‌

దాదాపు తొమ్మిది తెలుగు సినిమాల్లో `క‌న్నుల్లో నీ రూప‌మే` ఒక‌టి. అప్పుడ‌ప్పుడు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ త‌ర‌చుగా పేరున్న క‌థానాయ‌కుల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న న‌టుడు నందు హీరోగా చేసిన మ‌రో సినిమా ఇది. ఎన్నారై బిక్స్ ఇరుస‌డ్ల ద‌ర్శ‌క‌త్వం వహించారు

కథేంటంటే:

స‌న్నీ (నందు) స‌ర‌దాగా గ‌డిపే ఓ కుర్రాడు. బ‌స్టాప్‌లో సృష్టి (తేజస్విని ప్ర‌కాష్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అత‌నిపై తేజ‌స్వినికి కూడా ప్రేమ ఉన్నా తొంద‌ర‌గా బ‌య‌ట పెట్ట‌దు. కొన్నాళ్ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు స‌న్నీని ప్రేమిస్తున్నాన‌ని చెబుతుంది. అయితే అప్ప‌టికీ త‌మ ప్రేమ‌ని తన సోద‌రుడు ఒప్పుకుంటాడో లేదో అనే భ‌యం ఆమెని వెంటాడుతుంటుంది. ఇంత‌కీ సన్నీ జీవితంలో జ‌రిగిన ఆ సంఘ‌ట‌న ఏంటి? సృష్టితో అత‌ని పెళ్లి జ‌రిగిందా? లేదా? వీళ్ల పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

కానీ క‌థ‌లోనూ, క‌థ‌నంలోనూ బిగి లేక‌పోవ‌డంతో అటు ప్రేమ‌క‌థ పండ‌క‌, ఇటు సినిమాలోనూ థ్రిల్ క‌నిపించ‌క ఆద్యంతం స‌న్నివేశాలు చ‌ప్ప‌గా సాగిపోతాయి. ద‌ర్శ‌కుడు అనుకున్న కాన్సెప్ట్‌ వ‌ర‌కు ప‌ర్వాలేద‌నిపించినా దాని చుట్టూ స‌రైన స‌న్నివేశాలు మాత్రం రాసుకోలేక‌పోయారు. క‌థానాయ‌కుడు పెళ్లికి ముందు చెప్పే షాకింగ్ విష‌యాలు కానీ, వాటి ద్వారా పండే భావోద్వేగాలు కానీ సినిమాపై ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి. గ‌బ్బ‌ర్‌సింగ్ గ్యాంగ్‌, పోసాని కృష్ణ‌మురళి త‌దిత‌రులు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు కానీ… అది కూడా పూర్తిస్థాయిలో స‌ఫ‌లం కాలేదు. ప్రేమ‌క‌థ‌లో ఉండాల్సిన రొమాంటిక్ ఫీల్ కూడా మిస్స‌యింది. చాలా స‌న్నివేశాలు నిదానంగా, సాగ‌దీత‌గా న‌డుస్తుంటాయి.

ఎవ‌రెలా చేశారంటే:

ఈ చిత్రంలో న‌టీన‌టుల‌కి మంచి మార్కులు ప‌డ‌తాయి. నందు, తేజ‌స్విని ప్ర‌కాష్ చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ముఖ్యంగా నందు ప్రేమ స‌న్నివేశాల్లోనూ, భావోద్వేగాల విష‌యంలో ఆక‌ట్టుకుంటాడు. తేజ‌స్విని అంద‌మైన హావ‌భావాల‌తో అల‌రించింది. మిగిలిన పాత్ర‌ధారులంతా కూడా ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికత విష‌యాల‌కొస్తే సుభాష్ దొంతి కెమె‌రా ప‌నిత‌నం, సాకేత్ సంగీతానికి, ర‌చ‌యిత‌ల సాహిత్యానికి మాత్ర‌మే మంచి మార్కులు ప‌డ‌తాయి. సుభాష్ దొంతి కెమెరా స‌హ‌జ‌మైన అందాల్ని అంతే సహ‌జంగా తెర‌పై ఆవిష్క‌రించింది. మిగ‌తా విభాగాలు అంతగా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి. ముఖ్యంగా ఎడిటింగ్ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త తీసుకోవా‌ల్సింది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి.

బ‌లాలు:

ఛాయాగ్ర‌హ‌ణం

బ‌ల‌హీన‌త‌లు:

క‌థ‌, క‌థ‌నం

ఊహ‌కందే స‌న్నివేశాలు