‘కాలా’ మూవీ రివ్యూ
Spread the love

నిర్మాణ సంస్థ‌లు: వ‌ండ‌ర్ బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌

తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు

పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి

సంగీతం: స‌ంతోశ్ నారాయ‌ణ్‌

ఛాయాగ్ర‌హ‌ణం: ముర‌ళి.జి

నిర్మాత‌: ధ‌నుశ్‌

ద‌ర్శ‌క‌త్వం: పా.రంజిత్‌

కొన్ని సినిమాల కోసం సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ సినిమాల‌కు టైమ్‌తో సంబంధం ఉండ‌దు. ఎప్పుడు వ‌చ్చినా స‌రే! ఓ బ‌జ్ క్రియేట్ చేసేస్తాయి. అటువంటి వాటిలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలు ముందుంటాయి. ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా అంటే ఆ క్రేజే వేర‌ప్ప‌.. అంటూ ఉండే హంగామాకి తిరుగుండ‌దు. ర‌జ‌నీ స్టైల్‌, డైలాగ్ డెలివరీ, న‌ట‌న ఇలా అన్ని ప్రేక్ష‌కుల‌ను ఎప్పుడో మెప్పించేశాయి. ‘కబాలి’ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను డిఫరెంట్ లుక్‌లో చూపించిన దర్శకుడు పా.రంజిత్. మరోసారి తలైవాను డాన్‌గా చూపించారు. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

క‌థ‌:

తిరున‌ల్ వేలికి చెందిన యువ‌కుడు క‌రికాల‌న్‌(ర‌జ‌నీకాంత్‌) కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా ముంబై న‌గ‌రంలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాల్లో వారికి అండ‌గా నిల‌బ‌డి వారి నాయ‌కుడుగా ఎదుగుతాడు. అక్క‌డే జ‌రీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు(ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్‌).. కానీ ఒక్క‌టి కాలేక‌పోతారు. చివ‌ర‌కు కాలా సెల్వి(ఈశ్వ‌రీరావు)ను పెళ్లి చేసుకుంటాడు. ధారావి ప్రాంతం పేద ప్ర‌జ‌ల‌కు చెందింది. అక్క‌డున్న హిందూ ముస్లింలు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి మెలిసి ఉంటారు.

ప్ల‌స్ పాయింట్స్‌:

సినిమాకు ప్ర‌ధాన బ‌లం అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంతే. రెండేళ్లు(క‌బాలి) త‌ర్వాత ర‌జ‌నీకాంత్ చేసిన కాలా..ఆయ‌నకు రాజ‌కీయంగా స‌పోర్ట్ చేసేలా తెర‌కెక్కింద‌నాలి. ఎందుకంటే ఇందులో చ‌ర్చించిన ప్ర‌ధాన‌మైన పాయింట్ భూమి. స్వాతంత్యం వ‌చ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. 60 శాతం మంది ప్ర‌జ‌లు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. త్వ‌ర‌లోనే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌నున్న ర‌జ‌నీకాంత్‌కి ఉప‌యోగ‌ప‌డే కాన్సెప్ట్ ఇది. సినిమా బ్రిడ్జ్‌ఫై వ‌చ్చే ఫైట్‌, ఇంట‌ర్వెల్ బ్లాక్‌, కోర్ పాయింట్ అన్నీ మెప్పిస్తాయి.

మైన‌స్ పాయింట్స్‌:

ఇక సినిమాలో కోర్ పాయింట్ బాగానే ఉన్నా.. ర‌జ‌నీకాంత్ వంటి మాస్ హీరోను.. హీరోయిజాన్ని ఇంకా ఎలివేట్ చేయాల‌నిపిస్తుంది. అంద‌రికీ కోర్ థీమ్ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఇక తెలుగు పాట‌ల్లోని సాహిత్యం అస‌లు అర్థం కావ‌డం లేదు.

సమీక్ష‌:

కబాలి’ చిత్రంలో మాదిరిగానే ‘కాలా’ చిత్రంలో కూడా రజినీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ముంబయి గ్యాంగ్‌ వార్‌ నేపథ్యంలో ‘కాలా’ చిత్రం టీజర్‌ మరియు ట్రైర్‌లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రంజిత్‌ పా సినిమాను తెరకెక్కించాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఎప్పటిలాగే రజినీకాంత్‌ సినిమా అనగానే డైరెక్ట్‌ సినిమా కంటే భారీ ఎత్తున తెలుగులో విడుదల అవుతుంది. తమిళ డబ్బింగ్‌ అయిన ఈ చిత్రం ఖచ్చితంగా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. తెలుగులో ఈ చిత్రంను భారీ మొత్తం పెట్టి ప్రముఖ నిర్మాతలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 300 కోట్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు కలిగి ఉన్నారు

సినిమా అంతా ఆయ‌న చుట్టూనే తిరుగుతుంది. ర‌జ‌నీకాంత్ సినిమా అంటే మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా ఉండాల‌నుకునే ప్రేక్ష‌కుడికి ఇది డిఫ‌రెంట్‌గా అనిపిస్తుది. ఈశ్వ‌రీరావు, ర‌జ‌నీ మ‌ధ్య స‌న్నివేశాలు బావున్నాయి. ముఖ్యంగా ఈశ్వ‌రీరావు న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. పా.రంజిత్ ఈ సినిమాలో ఓ కోర్ పాయింట్‌.. పేద‌వాడు ఉండ‌టానికి చోటు కావాలి. ఇంత పెద్ద దేశంలో ఇంకా పేద‌వాడికి ఉండ‌టానికి ఇళ్లు ఎందుకు లేవు. అనే ప్ర‌శ్న‌ను రైజ్ చేయించాడు. ర‌జ‌నీకాంత్‌లాంటి మాస్ హీరోతో ఇలాంటి సినిమా చేయ‌డం గ్రేట్‌. ర‌జ‌నీ కూడా నేను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయాల‌ని కాకుండా ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయాల‌ని ఆలోచించి ఇమేజ్‌కి భిన్నంగా చేసిన సినిమా ఇది. నానా ప‌టేక‌ర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన న‌ట‌న‌తో నానా క్యారెక్ట‌ర్‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేశాడు. ఎన్‌జి.ఒ స‌భ్యురాలుగా హ్యూమా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఇక సాంతికేకంగా చూస్తే ముర‌ళి.జి సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోశ్ నారాయ‌ణ్ సంగీతం, నేప‌థ్య సంగీతం ఒకే. సినిమాలో ర‌జనీ చేసే ఫ్లై ఓవ‌ర్ ఫైట్ సీన్‌.. ఇంట‌ర్వెల్ బ్లాక్ మెప్పిస్తాయి.

రేటింగ్‌: 3/5

Leave a Reply