‘ఝాన్సీ‌’ సినిమా రివ్యూ
Spread the love

న‌టీన‌టులు: జ్యోతిక, జి.వి. ప్రకాష్, ఇవానా, రాక్‌లైన్ వెంక‌టేష్‌, గురు శంక‌ర్ త‌దిత‌రులు

స‌ంగీతం: ఇళ‌య‌రాజా

ఛాయాగ్ర‌హ‌ణం: తేని ఈశ్వ‌ర్‌

నిర్మాతలు: డి.అభిరామ్‌, అజయ్ కుమార్, డి.వెంకటేష్‌, కోనేరు కల్పన

ద‌ర్శ‌క‌త్వం: బాలా

సంస్థ‌: కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్

తెలుగులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌లు అన‌గానే సూర్య న‌టించిన ‘సింగం’ సినిమాలు గుర్తుకొస్తాయి. సింహం.. సింహం.. హీజ్‌ న‌ర‌సింహం.. అంటూ ఆయ‌న చేసే హంగామా మాస్ ప్రేక్ష‌కుల్ని మురిపిస్తుంటుంది. తాజాగా ఆయ‌న భార్య జ్యోతిక కూడా అదే త‌ర‌హా పోలీస్ అవ‌తార‌మెత్తింది. లేడీ సింగంగా మారింది. పోలీస్ ‘ఝాన్సీ’గా లాఠీ ఝుళిపిస్తోంది. తమిళ్‌లో ఫిబ్రవరిలోనే రిలీజ్‌ అయిన నాచియార్‌ సినిమాను తెలుగులో ఝాన్సీ పేరుతో ఈ రోజు(శుక్రవారం) విడుదల చేశారు. మరి బాలా మార్క్‌ టేకింగ్‌ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా..? రఫ్‌ అండ్‌ టఫ్‌ పోలీస్‌ పాత్రలో జ్యోతిక ఏ మేరకు ఆకట్టుకున్నారు..?

కథ ;

మైనర్లయిన గాలి రాజు (జీవి ప్రకాష్ కుమార్‌), రాశి (ఇవానా) ప్రేమించుకుంటారు. రాశి గర్భవతి అవుతుంది. దీంతో గాలి రాజు మీద రేప్‌ కేసు నమోదు చేస్తారు. ఈ కేసును సిన్సియర్‌ ఆఫీసర్‌ ఝాన్సీ ( జ్యోతిక) డీల్‌ చేస్తుంది. రాశిని తన సంరక్షణలోనే ఉంచుకొని కేసు ఎంక్వయిరీ చేస్తుంటుంది. గాలిరాజును అరెస్ట్‌ చేసిన పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది.  ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఇంత‌లో రాశి గ‌ర్భ‌వ‌తి అనే విష‌యం తెలుస్తుంది. ఆమెని అత్యాచారం చేశాడ‌ని రాజుపై నేరం మోపుతారు. రాశి మాత్రం తానూ, రాజు ప్రేమించుకున్నామ‌ని కోర్టులో చెబుతుంది. దాంతో రాజుని బాల‌నేర‌స్థుల కారాగారానికి పంపుతారు. రాశిని ఏసీపీ ఝాన్సీ (జ్యోతిక) త‌న ఇంటికి తీసుకెళుతుంది. రాశి.. బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చాక ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలుస్తుంది. ఆ విష‌యం ఝాన్సీకి స‌వాల్‌గా మారుతుంది. ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డకుండా.. నేర‌స్తుల‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తూ నిజాల్ని బ‌య‌టికి క‌క్కించే ఏసీపీ ఝాన్సీ.. ఈ కేసుని ఎలా ఛేదించిందనే విష‌యాన్ని తెర‌పై చూడాల్సిందే.

Jhansi Movie Review in Telugu

విశ్లేషణ ;

ఇప్పటి వరకు బాలా దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమాల్లో కాస్త లైటర్‌వేలో తెరకెక్కిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. బాలా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్‌, రా నెస్‌ కాస్త తక్కువగానే కనిపిస్తాయి. ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్. సున్నిత‌మైన విష‌యాల‌తో కూడిన ఒక నేరాన్ని ఏసీపీ ఎలా బ‌య‌ట‌పెట్టిందనేదే ఈ చిత్రం. బాలా స్టైల్ వాస్త‌వికత‌తో సాగుతుంది. ఇదివ‌ర‌కటి బాలా సినిమాల‌కీ, ఈ సినిమాకీ చాలా వ్య‌త్యాసం ఉంటుంది. దుఃఖ‌భ‌రిత‌మైన స‌న్నివేశాల‌తో సినిమాల్ని ముగించే బాలా ఈ చిత్రంలో మాత్రం క‌థ‌ని సుఖాంతం చేశాడు. అయితే, క‌థ‌లో మాత్రం సంక్లిష్ట‌త కొర‌వ‌డింది. క‌థ‌లోనూ, స‌న్నివేశాల్లోనూ వాస్త‌విక‌త క‌నిపిస్తుంది. కానీ..ఆశించిన స్థాయిలో థ్రిల్‌ని పంచ‌దు. ప్ర‌థ‌మార్థం గాలిరాజు, రాశిల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలతోనే సాగుతుంది. చాలా కాలం తరువాత తెలుగు తెరమీద కనిపించిన జ్యోతిక డిఫరెంట్‌ రోల్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగు ప్రేక్షకులకు గ్లామర్‌ గర్ల్‌గానే తెలిసిన జ్యోతికను రఫ్‌ అండ్‌ టఫ్‌ రోల్‌లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.

Jhansi Movie Review in Telugu

ఎవ‌రెలా చేశారంటే:

రాశి పాత్రతో వెండితెరకు పరిచయం అయిన ఇవాన నటన సూపర్బ్‌. ఇది ఆమెకు తొలి సినిమా అంటే నమ్మలేం. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్ సినిమా నిడివి. క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన సినిమాను ఎక్కువగా సాగతీయకుండా ఒకటి రెండు సన్నివేశాల్లోనే అసలు కథ మొదలు పెట్టాడు బాలా. తొలి భాగంలో వచ్చే ఒకటి రెండు కామెడీ సీన్స్‌ తప్ప కథకు అవసరం లేని సన్నివేశాలు పెద్దగా కనిపించవు. రాక్‌లైన్ వెంక‌టేష్ జ్యోతిక‌కి సాయ‌ప‌డే పోలీసు అధికారిగా క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా బాగుంది.

సంగీతం:

తేని ఈశ్వ‌ర్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ కావ‌డంతో సాగ‌దీత ఎక్కువ లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టున్నాయి. డైలాగ్స్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తెలుగు రిలీజ్‌ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలేవి తీసుకున్నట్టుగా అనిపించదు. తమిళ బోర్డులు, నేమ్‌ ప్లేట్లు తమిళ్‌లోనే కనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Jhansi Movie Review in Telugu

ప్లస్‌ పాయింట్స్‌ :

కథా కథనం

వాస్త‌వికత

జ్యోతిక, జీవా, ఇవానా, న‌ట‌న

మైనస్‌ పాయింట్స్‌ ;

తమిళ నేటివిటి

డబ్బింగ్‌

చివ‌రిగా: ఝాన్సీ.. ఓ పోలీసు ప‌రిశోధ‌న

రేటింగ్: 3/5