హలో గురు ప్రేమకోసమే రివ్యూ
Spread the love

నటీనటులు: రామ్-అనుపమ పరమేశ్వరన్-ప్రకాష్ రాజ్-ప్రణీత-ఆమని-సితార-జయప్రకాష్-పోసాని కృష్ణమురళ ప్రవీణ్ తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: విజయ్.కె.చక్రవర్తి

కథ మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్-లక్ష్మణ్

దర్శకత్వం: త్రినాథరావు నక్కిన

ఓ భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో రామ్, దర్శకుడు నక్కిన త్రినాథరావు కలిసి దిల్ రాజు నిర్మాతగా చేసిన సినిమా “ హలో గురు ప్రేమ కోసమే” . టైటిల్ తోనే ప్రేమ కధ అని తెలిసిపోయింది . పైగా ఈ మధ్య కొత్త కొత్త దర్శకులు సరికొత్త ఐడియాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలు సాధిస్తున్నారు. నేను లోకల్’ లాంటి చిత్రాలతో సత్తా చాటుకున్న త్రినాథరావు నక్కిన రూపొందించిన చిత్రమిది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

కాకినాడ నుంచి హైదరాబాద్ కి ఉద్యోగం కోసం వస్తాడు సంజు (రామ్ ). ఆ ప్రయాణంలో అను ( అనుపమ పరమేశ్వరన్ ) అనే అమ్మాయి కాకినాడ కుర్రోళ్లని తక్కువ చేసి మాట్లాడడంతో ఆమెకి బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తాడు. హైదరాబాద్ వెళ్ళగానే తాను వుండాల్సింది ఆమె ఇంట్లో గెస్ట్ గా అని తెలుస్తుంది. ట్రైనర్‌గా ఐటీ జాబ్‌లో చేరిన సంజు.. ఆఫీసులో ప్రణీతను ఇంప్రెస్ చేస్తాడు. తర్వాత తను అనుపమను ప్రేమిస్తున్నానని రియలైజ్ అవుతాడు. ప్రణీత లవ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తాడు. ఈలోగా ప్రకాష్ రాజ్ తన కూతురికి మరో సంబంధం చూస్తాడు. దాంతో సంజు షాకవుతాడు. ఈ ట్విస్ట్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ప్రణీతకు సంజు ఎందుకు నో చెప్పాడో డైరెక్టర్ కన్విన్స్‌గా చెప్పలేకపోయాడు.

Hello Guru Prema Kosame movie Review

విశ్లేష‌ణ ;

ఓ తండ్రి , కూతురు , ప్రేమికుడి మధ్య సంఘర్షణ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. నువ్వే నువ్వే , ఆకాశమంత తో మొదలైన ఈ తరహా కధలు చాలా వరకు విజయవంతం అయ్యాయి. హీరో తన ఆఫీసులో ఓ అమ్మాయిని ప్రేమించాలని ఫిక్సవుతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతడి ప్రయత్నం ఫలించి తీరా ఆ అమ్మాయి ఇతడికి ప్రపోజ్ చేస్తూ ఆమె ఫీలింగ్స్ చెబుతుంటే.. సరిగ్గా నాకు ఇంకో అమ్మాయి మీద ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయంటూ ఆమె దగ్గరికి పరుగెడతాడు హీరో. అంటే తాను లవ్ చేస్తున్నట్లుగా భావిస్తున్న అమ్మాయి తన ఫీలింగ్స్ చెప్పే వరకు అతడికి హీరోయిన్ మీద ఉన్న ప్రేమ తెలియదట. ఏం లాజిక్కో ఇది. ఈ ఒక్క విషయంలోనే కాదు.. ‘హలో గురూ ప్రేమ కోసమే’లో లాజిక్ తో సంబంధం లేని విషయాలు చాలా ఉన్నాయి. హీరో తన ప్రేమను హీరోయిన్ తండ్రికి చెబితే.. అతను ఒక తండ్రిగా వ్యతిరేకిస్తూ.. ఒక ఫ్రెండుగా మాత్రం అతడికి సహకారమందించడానికి సిద్ధపడతాడు. సినిమాలో కొంచెం కొత్తగా అనిపించే పాయింట్ ఇదొక్కటే కానీ.. అది కూడా అంత లాజికల్ గా అనిపించదు. కానీ ఈ విషయం మరీ ఎబ్బెట్టుగా అనిపించకుండా వినోదపు పూతతో కన్విన్సింగ్ గా చెప్పడానికి ప్రయత్నించారు రచయిత ప్రసన్న కుమార్.. దర్శకుడు త్రినాథరావు.

తొలి సగంలో ప్రణీత పాత్రను కూడా కేవలం సన్నివేశాలను పొడిగించుకోవడానికి వాడుకున్నదే. పతాక సన్నివేశాలను ఇంకా బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. ఆ సన్నివేశాల్లో ‘పరుగు’ క్లైమాక్స్‌ ఛాయలు కనిపిస్తాయి. ఒక సక్సెస్‌ ఫార్ములాను దర్శకుడు ఎంచుకున్నాడు. దానికి తనదైన శైలిలో వినోదం జోడించి చూపించగలిగాడు. ‘హలో గురు ప్రేమ కోసమే’ అన్నది అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ రెండున్నర గంటల పాటు ఏమాత్రం వినోదానికి ఢోకా లేకుండా చూసుకున్నాడు.

నటీనటులు:

ఇందులోని సంజు క్యారెక్టర్ చాలా చోట్ల ‘నేను శైలజ’లో కథానాయకుడి పాత్రను గుర్తుకు తెస్తుంది. అందులో మాదిరే రామ్ అతి చేయకుండా తన పాత్రను అండర్ ప్లే చేయడానికి ప్రయత్నించాడు. కామెడీ సీన్లలో రామ్ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్లలో కూడా బాగా చేశాడు. రామ్ లుక్ కూడా బాగుంది. కెరీర్లో ది బెస్ట్ లుక్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా చేసింది. కాకపోతే ఆ పాత్రలో ఇంకొంచెం డెప్త్ ఉండాల్సింది. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర అనుపమది. ఫ్యామిలీ గర్ల్‌గా, తండ్రిని ఎంతో ఇష్టపడే అమ్మాయి పాత్రకు అనుపమ న్యాయం చేసింది. మిగతా పాత్రలన్నీ సందర్భానుసారం వచ్చి వెళ్తుంటాయి.

సాంకేతికవర్గం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సంతృప్తినివ్వదు. మామూలు సినిమాల్ని కూడా కొన్నిసార్లు తన పాటలు.. నేపథ్య సంగీతంతో పైకి లేపే దేవి ఈసారి నిరాశ పరిచాడు. పాటలన్నీ ఓ మోస్తరుగా అనిపిస్తాయి. సినిమా మాదిరే పాటల్లోనూ కొత్తదనం లేదు. స్టోరీ ముందే అర్థమైపోవడం వల్ల ప్రేక్షుకుడిలో ఆసక్తి తగ్గుతుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. రామ్ కాస్ట్యూమ్స్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. ప్రసన్న కుమార్ డైలాగ్స్ పేలాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్, దేవీ శ్రీ సంగీతం ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండనిపిస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్ :

రామ్‌

వినోదాత్మక సన్నివేశాలు

కామెడీ

మైన‌స్ పాయింట్స్ :

రొటీన్‌ కథ

కొన్ని బోరింగ్‌ సన్నివేశాలు, పాటలు

చివరిగా: హలో గురు ‘టైమ్‌ పాస్‌’ కోసమే

రేటింగ్: 3 /5