‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ రివ్యూ
Spread the love

నటీనటులు: విశ్వక్సేన్‌ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభివన్‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను, అనిషా ఆంబ్రోస్‌, సిమ్రన్‌ చౌదరి తదితరులు

సంగీతం: వివేక్‌ సాగర్‌

ఛాయాగ్రహణం: నికిత్‌ బొమ్మి

నిర్మాత: డి.సురేష్‌బాబు

రచన, దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌

బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌

“ఈ నగరానికి ఏమైంది “ తెలుగు సినిమా చూసే ప్రతివాడికి ఈ డైలాగ్ పరిచయమే. సినిమా ముందు ట్రైలర్ లో ఈ డైలాగ్ అందరి నోళ్ళలో నానింది. అదే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసినప్పుడు కాస్త పాతగా అనిపించింది. ఈ చిత్రంతో తరుణ్‌ భాస్కర్‌ ప్రతిభేంటో చిత్ర రంగానికి తెలిసింది. అంతేకాదు, జాతీయ అవార్డునూ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ నగరానికి ఏమైంది?’ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. పదికి పైగా చిన్న సినిమాలు రిలీజ్  అవుతున్న ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో తరుణ్‌ భాస్కర్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడా..? ఈ నగరానికి ఏమైంది? యాడ్‌ రేంజ్‌లో సినిమా కూడా సక్సస్‌ అయ్యిందా..?

కథ;

వివేక్‌(విశ్వక్సేన్‌ నాయుడు), కార్తీక్‌(సుశాంత్‌రెడ్డి), కౌశిక్‌(అభినవ్‌గో మతం), ఉపేంద్ర(వెంకటేశ్‌ కాకుమాను) నలుగురు స్నేహితుల కథ ఇది. వీరు ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలని అనుకుంటారు. దాంతో తమ ప్రతిభకు ఈ ప్రపంచానికి చూపించాలని అనుకుంటారు. ఈ నలుగురి స్నేహితుల మధ్య కొంత దూరం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో కార్తిక్ పెళ్లి కుదురుతుంది. తన బాస్ కూతురిని పెళ్లిచేసుకుని అమెరికాలో లగ్జరీ లైఫ్ అనుభవించడానికి కార్తిక్ సిద్ధమవుతాడు. అతని దృష్టిలో ఇదొక బిజినెస్ డీల్. ప్రేమ గీమ పేరుతో సమయాన్ని వృథా చేయడం అతనికి అస్సలు ఇష్టంలేదు. ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే:

త‌రుణ్ భాస్క‌ర్ కాకుండా, వేరెవ‌రైనా ఇదే క‌థ‌ని, సురేష్ బాబుకి, ఇలానే చెబితే మొహ‌మాటం లేకుండా ఎగ్జిట్ గేటు వైపు చూపించేద్దుడు. కానీ త‌రుణ్ భాస్క‌ర్ స్టామినా తెలిసిన నిర్మాత కాబ‌ట్టి – ‘గో ఎహెడ్‌’ అనేశాడు. ‘పెళ్లిచూపులు’ సినిమాలో త‌రుణ్ బ‌ల‌మైన క‌థేం చూపించ‌లేదు. స‌న్నివేశాల్ని లైవ్లీగా, లైవ్‌లో చూస్తున్న‌ట్టు రాసుకున్నాడు. ఈ సినిమా గురించి ఏమైనా చెప్పుకోవాలి అంటే అది ముందుగా తరుణ్ గురించే. ఆయన రాసుకున్న స్క్రీన్‌ప్లే, సహజసిద్ధమైన డైలాగులు, సర్వసాధారణమై సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాకు ప్రధాన బలం. నలుగురు స్నేహితుల పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ప్రధాన పాత్ర వివేక్ మీకు చాలా కాలం గుర్తిండిపోతాడు. వివేక్ పాత్రలో భావోద్వేగాలను దర్శకుడు బాగా చూపించారు.

హీరో – హీరోయిన్లు విడిపోతే – ‘ఆ చివ‌ర్లో క‌లుసుకుంటార్లే’ అనిపిస్తుంది ప్రేక్ష‌కుల‌కు. హీరో కోసం ఎదురు చూసి, ఎదురు చూసీ, ఇంట్లో వాళ్లు తెచ్చిన సంబంధాన్నీ, కోట్ల ఆస్తుల్ని వ‌దిలేసి హీరో కోసం వ‌చ్చేస్తుంది హీరోయిన్‌. ఇదంతా సినిమాల్లో. నిజ జీవితంలో అలా జ‌ర‌గ‌దు. ప‌రిస్థితుల‌కు స‌ర్దుకుపోతారంతా. స‌రిగ్గా ఈ సినిమాలోనూ అంతే. హీరో, హీరోయిన్లు విడిపోయాక‌,ఏ గోవాలోనో క‌లిసిపోతారులే అనుకుంటారు. కానీ అస‌లు విడిపోయిన ఆ అమ్మాయి ప్ర‌స్తావ‌న రాకుండా, క‌థ‌ని వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా న‌డిపాడు.

బలమైన కథ లేకపోవడంతో సన్నివేశాలు అప్పుడప్పుడు పట్టు తప్పినట్లు, పాత్రలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నట్లు అనిప్తాయి. వివేక్‌ పాత్రలో ‘అర్జున్‌రెడ్డి’ ఛాయలు కనిపించడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ప్రేమ జంట విడిపోవడానికి పెద్ద కారణం లేకపోవడం దాన్నే తలచుకుంటూ వివేక్‌ కొన్నేళ్ల పాటు స్నేహితులకు దూరంగా ఉండటం అతకలేదు. మద్యం తాగే సన్నివేశాలు ఎక్కువ కావడం కుటుంబ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించేదే. యువతరానికి నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. వాటిని నమ్ముకునే ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది.

న‌టీన‌టులు;

సినిమా మొద‌ల‌య్యేట‌ప్ప‌టికి ఇందులో న‌టిస్తున్న వాళ్లెవ్వ‌రి గురించి ప్రేక్ష‌కుల‌కు ఓ ఐడియా అంటూ ఉండ‌దు. సినిమా ముగిసేలోపు వాళ్ల‌తో స్నేహం చేయ‌డం మొద‌లెడ‌తాం. అంత‌కంటే ఏం కావాలి? తన హావభావాలు, హాస్యంతో కడుపుబ్బా నవ్వించాడు. కార్తిక్ పాత్రలో సుశాంత్, ఉపేంద్ర పాత్రలో వెంకటేష్ ఒదిగిపోయారు. ప్రతి గ్యాంగ్‌లోనూ ఒక రఫ్ క్యారెక్టర్ తప్పనిసరి. అలాంటి పాత్రే ఉపేంద్ర. ఈ క్యారెక్టర్‌లో వెంకటేష్ నటన సహజసిద్ధంగా ఉంది. ఇక హీరోయిన్లు అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఏమీలేదు. తమ పరిధి మేర వాళ్లు బాగానే నటించారు.

సాంకేతిక వ‌ర్గం:

వివేక్ సాగ‌ర్‌ క‌థ‌ని అర్థం చేసుకుని ఆ మూడ్‌కి త‌గిన సంగీతం అందించాడు. టైటిల్ కార్డు, ఇంట్ర‌వెల్ కార్డు. ఎండ్ కార్డు ప‌డేట‌ప్పుడు వ‌చ్చిన కిక్ అంతా ఇంతా కాదు. అదంతా వివేక్ మ‌హ‌త్తు. ఆయన సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. వివేక్ సాగర్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగినట్లుగా ఉంది. రవితేజ గిరిజాల సినిమాను చాలా క్రిస్పీగా ఎడిటింగ్ చేశారు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్‌లో నిర్మాత సురేష్ బాబు మనసును హత్తుకునే సినిమాను నిర్మించారు.

బలాల

నటీనటుల ప్రతిభ

యూత్‌కు నచ్చే సన్నివేశాలు

బలహీనతలు

బలమైన కథ లేకపోవడం

లవ్‌ స్టోరి

రేటింగ్: 3/5