చిన‌బాబు మూవీ రివ్యూ
Spread the love

టైటిల్ : చినబాబు

జానర్ : ఫ్యామిలీ డ్రామా

తారాగణం : కార్తీ, సయేషా, సత్యరాజ్‌, సూరి, ప్రియా భవానీ శంకర్‌, భానుప్రియ, విజి చంద్రశేఖర్‌ తదితరులు

సంగీతం : డి ఇమాన్‌

దర్శకత్వం : పాండిరాజ్‌

నిర్మాత : సూర్య

సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌

ఎడిటింగ్‌: రుబెన్‌

బ్యానర్‌: 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ నటుల్లో ఒకరు. గతంలో ఆయన నటించిన యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఖాకీ లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. దాంతో తమిళంలో కార్తి చేసే సినిమాలు తెలుగులోనూ విడుదలవుతూ వస్తున్నాయి. ఎప్పుడూ చూడని పాత్రలో కార్తి నటించిన చిత్రం ‘చినబాబు’. ఇందులో ఆయన రైతు పాత్రలో నటించారు. ఈ సినిమా ఆయ‌న‌కు ఎలాంటి చిత్ర‌మ‌వుతుంది? ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ చేస్తుందా? త‌మిళ సంప్ర‌దాయాలు తెలుగు నేటివిటీకి స‌రిపోయాయా? వ‌ంటివి తెలుసుకోవాలంటే ఆల‌స్య‌మెందుకు.. చ‌దివేయండి.

క‌థ‌:

పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్‌) రైతు. ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న పెద్ద కుటుంబ యజమాని. ఎప్పటికైనా తన కూతుళ్లు, అల్లుల్లు.. వాళ్ల పిల్లలను ఇంటికి పిలిచి అందరితో కలిసి ఓ ఫ్యామిలీ ఫొటో తీయించుకోవాలని ఆశపడుతుంటాడు. అక్కల ఆప్యాయతల మధ్య పెరిగిన చినబాబు తన ఇద్దరు మేనకోడళ్లను కాదని మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. వేరే అమ్మాయితో పెళ్లికి అక్కలు, బావలను ఎలా ఒప్పించగలిగాడు..? ఈ నేప‌థ్యంలో త‌న అక్క‌ల‌ను, బావ‌ల‌ను ఒప్పించి కృష్ణంరాజు ఎలా నీర‌ద మెడ‌లో మూడు ముళ్లు వేశాడు? ద‌ఆనికి ఎవ‌రెవ‌రు అడ్డుప‌డ్డారు? ఎవ‌రెవ‌రు సాయం చేశారు అనేది ఆస‌క్తిక‌ర‌మైన మిగిలిన చిత్రం.

విశ్లేషణ ;

రైతు కష్టాలను సున్నితంగా చర్చిస్తూనే ఒక ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, అలకలు, కోపాల్ని తెరపైకి తీసుకురాగలిగాడు దర్శకుడు. ‘చినబాబు’ను నడిపించింది వినోదం, భావోద్వేగపు సన్నివేశాలే. కామెడీ ట్రాక్‌పై ఆధారపడకుండా కథ, పాత్రల ప్రవర్తన, సన్నివేశాల నుంచి దర్శకుడు కావాల్సినంత వినోదం పండించాడు. సినిమాలో ఏదో పేరుకే హీరో పాత్ర‌కు రైతు వేషం వేయించ‌కుండా, సినిమా మొత్తం ఆ వృత్తిని గొప్ప‌గా చెప్పేలా చాలా డైలాగులున్నాయి. సాయేషా ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగింది. కృష్ణంరాజు అక్క పాత్ర‌ల్లో న‌టించిన ఐదుగురు ఎవ‌రికి వారు బాగా న‌టించారు. మేన‌కోడ‌ళ్లుగా న‌టించిన ఇద్దరి ముఖాలు పెద్ద‌గా రిజిస్ట‌ర్ కావు.

సినిమాలో తెలుగు బోర్డుల‌ను పెట్ట‌ద‌ల‌చుకున్న‌ప్పుడు అంత‌టా తెలుగే పెట్టాల్సింది. కొన్ని స‌న్నివేశాల్లో మాత్రం తెలుగు బోర్డులు చూపించి, కోర్టు సీన్లలోనూ, శ‌త్రు క్రూర‌మైన హ‌త్య‌ల గురించి ఆరా తీసేట‌ప్పుడు తెర‌మీద త‌మిళ అక్ష‌రాల‌ను చూపించ‌డం ఎందుకో క‌ల‌గాపుల‌గంగా అనిపిస్తుంది. ఆఖరికి సీరియస్‌గా సాగుతున్న సన్నివేశంలోనూ ఎక్కడో ఒక చోట కొసమెరుపులా నవ్వించే ప్రయత్నం చేశాడు. అందుకే సన్నివేశాలన్నీ ఆహ్లాదభరితంగా సాగుతాయి. దర్శకుడు ఒక ఉమ్మడి కుటుంబం మధ్యలో కూర్చుని సన్నివేశాలు రాసుకున్నాడేమో అనిపిస్తుంది.

ఆడియెన్స్‌ను సినిమాలో లీనమయ్యేలా చేయడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. తొలి అర్ధభాగంలో ఫర్వాలేదనిపించిన ‘చినబాబు’ రెండో అర్ధభాగంపై అంచనాలు పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ముగుస్తుంది. కుటుంబమంతా కలిసుండాలన్న కథానాయకుడి ఆకాంక్షకు ఈ చిత్రంలోని సన్నివేశాలు అద్దం పడతాయి. ఉమ్మడి కుటుంబాలు దూరమైపోతున్న ఈ తరుణంలో వాటి విలువలను చూపించిన చిత్రమిది.

నటీనటులు ;

వ్యవసాయం చేసే రైతు పాత్రలో చినబాబు పాత్రలో కార్తి ఒదిగిపోయారు. అతడి తండ్రిగా సత్యరాజ్ చక్కటి నటన కనబరిచారు. చినబాబు మేనల్లుడిగా, ఎప్పుడూ అతణ్నే అంటిపెట్టుకుని తిరిగే స్నేహితుడిగా సూరీ ఆకట్టుకున్నారు. హీరోయిన్‌ సయేషాది దాదాపుగా అతిథి పాత్రే. ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. గత చిత్రాల్లో మోడ్రన్‌ అమ్మాయిగా కనిపించిన సయేషా పల్లెటూరి అమ్మాయిగానూ మెప్పించింది.

సాంకేతిక విభాగం:

పల్లెటూరి వాతావరణాన్ని, కుటుంబంలోని రకరకాల మనుషుల వ్యక్తిత్వాన్ని అర్థవంతంగా చూపించగలిగాడు. సంభాషణలు అలరిస్తాయి. సినిమాకు సంగీతం చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుం‍ది. సూర్య కథ మీద నమ్మకంతో తమ్ముడి కోసం భారీగానే ఖర్చు చేసి సినిమాను నిర్మించారు.

ప్లస్‌ పాయింట్స్‌ ;

కథా నేపథ్యం

ప్రధాన పాత్రల నటన

మైనస్‌ పాయింట్స్‌ ;

కొన్ని చోట్ల ఎమోష‌న్ స‌రిగా పండ‌లేదు

నేటివిటి

ప్రధాన పాత్రల్లో తమిళ నటులే కనిపించటం

రేటింగ్‌: 3/5