‘చి.ల‌.సౌ’ సినిమా రివ్యూ
Spread the love

తారాగ‌ణం: సుశాంత్‌, రుహానీ శ‌ర్మ‌, వెన్నెల‌కిశోర్‌, అనుహాస‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంజ‌య్ స్వ‌రూప్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహారి

క‌ళ‌: వినోద్ వ‌ర్మ‌

కూర్పు: ఛోటా కె.ప్ర‌సాద్‌

ఛాయాగ్ర‌హ‌ణం: ఎం.సుకుమార్‌

నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల

ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌

సంస్థ‌: సిరుని సినీ కార్పొరేషన్, అన్న‌పూర్ణ స్టూడియోస్

సుశాంత్ సినిమాలు స‌గ‌టు క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లోనే తెర‌కెక్కేవి. ఆ క‌థ‌లు ఆయ‌న‌కి అంత‌గా న‌ప్పేవి కావు. హీరోగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నే ఉన్నాడు. ఏవో హీరోయిక్ సినిమాలు చేస్తున్న సుశాంత్‌. ఈసారి రూట్ చేసిన ప్ర‌య‌త్న‌మే `చి.ల‌.సౌ`. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారాడు. ప్ర‌చార చిత్రాలు విడుద‌ల కావ‌డంతోనే సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఇదే ద‌శ‌లోనే నాగార్జున ఈ చిత్రంలో భాగం కావ‌డంతో అవి మ‌రింత పెరిగాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.

క‌థ‌:

అర్జున్ (సుశాంత్‌) మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు పెళ్లే వ‌ద్ద‌ని మొండికేస్తుంటాడు. డ‌బ్బు సంపాదించి ఓ కారు కొనుక్కొని, యూర‌ప్ టూర్ వెళ్లి రావాల‌నుకుంటుంటాడు. కానీ ఇంట్లోవాళ్లేమో వ‌య‌సైతే పెళ్లి సంబంధాలు రావ‌డం క‌ష్ట‌మ‌నీ, పెళ్లి చేసుకోమ‌ని ఒత్తిడి చేస్తుంటారు. ఇంట్లోనే ఎవ‌రూ లేకుండా కేవ‌లం అర్జున్ మాత్రమే ఉండేలా అంజ‌లి(రుహానీ శ‌ర్మ‌)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. అంజ‌లితో పెళ్లి ఇష్టం లేద‌ని ముందు అర్జున్ చెప్పేసిన త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల కార‌ణంగా ఆమెతో ఓ క‌నెక్ష‌న్ ఏర్ప‌డుతుంది. దాంతో ఆమె అంటే ఇష్టం ఏర్ప‌డుతుంది. అదే స‌మ‌యంలో అంజ‌లి త‌ల్లి(రోహిణి)కి ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో అర్జునే ఆమెకు స‌హాయంగా నిలుస్తాడు. త‌ర్వాత జ‌రిగే ప‌రిస్థితులు అర్జున్‌, అంజ‌లి మ‌ధ్య ఎలాంటి బంధాన్ని ఏర్ప‌రుస్తాయ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

పెళ్లంటే ఇష్టం లేని ఓ అబ్బాయి… పెళ్లి త‌ప్ప‌నిస‌రి అయిన ఓ అమ్మాయి చుట్టూ సాగే క‌థ ఇది. ఒక రోజు జ‌రిగే ఈ క‌థ‌లో పెళ్లీడుకొచ్చిన ఓ జంట మ‌ధ్య భావోద్వేగాలే కీల‌కం. వాస్త‌విక‌తకి పెద్ద‌పీట వేస్తూ ఈ క‌థ‌ని రాసుకొన్నాడు ద‌ర్శ‌కుడు. దాంతో ఆరంభం నుంచే ప్రేక్ష‌కుడు క‌థ‌లో లీన‌మైపోతాడు. పెళ్లంటేనే చిరాకు ప‌డే యువ‌కుడిగా సుశాంత్ క‌నిపిస్తాడు. అస‌లు అర్జున్‌కి పెళ్లంటే ఎందుకు ఇష్టం లేద‌నే విష‌యాన్ని చాలా స‌న్నివేశాల త‌ర్వాత కానీ చెప్ప‌క‌పోవ‌డంతో, ఆరంభంలోని స‌న్నివేశాలు కాస్త సాగ‌దీత‌లా, స‌హ‌జ‌త్వానికి దూరంగా ఉన్న‌ట్టు అనిపిస్తాయి.

ఇక హీరో స్నేహితుడి పాత్ర‌లో న‌టించి వెన్నెల‌కిషోర్ పండించిన కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. ఇక సాంకేతికంగా చూస్తే.. రాహుల్ ర‌వీంద్ర‌న్ తొలి సినిమాను ఏదో బ్ర‌హ్మాండంగా తీసేయాల‌ని కాకుండా పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్‌పై సింపుల్ క‌థ‌ను చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. చిన్న చిన్న ఎమోష‌న్స్‌… హీరో హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. కామెడీ స‌న్నివేశాలు.. అన్ని చాలా చ‌క్క‌గా రాసుకున్నాడు. ఎక్క‌డా క‌న్‌ప్యూజ‌న్ లేకుండా చెప్పాడు. ఇలాంటి కాన్సెప్ట్‌ను హ్యాండిల్ చేయ‌డం చాలా క‌ష్టం. చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. రాహుల్ క‌థ‌ను హ్యాండిల్ చేసిన తీరు మెచ్చుకోలుగా ఉంది. ఇక ప్ర‌శాంత్ విహారి పాట‌లు క‌థ‌లో భాగంగానే సాగిపోయాయి. ఆర్‌.ఆర్ బావుంది. సుకుమార్ కెమెరావ‌ర్క్ బావుంది. తొలి ప్ర‌య‌త్నంలో ఏదో కొత్త‌ను చెప్పాల‌ని కాకుండా తెలిసిన క‌థ‌ను కొత్త‌గా చెప్పాల‌ని రాహుల్ ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. హీరో పెళ్లి వ‌ద్దునుకోవ‌డం..

ఎవ‌రెలా చేశారంటే:

త‌న‌కి, త‌న బాడీలాంగ్వేజ్‌కి త‌గ్గ క‌థ కావ‌డంతో సుశాంత్ ఈ చిత్రంలో మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో క‌నిపించాడు. అర్జున్ పాత్ర‌లో ఇమిడిపోయాడు. హావ‌భావాలు, భావోద్వేగాలు ఇలా అన్నీ స‌హ‌జంగా అనిపిస్తాయి. ఈ చిత్రంతో సుశాంత్‌లోని కామెడీ టైమింగ్ కూడా బాగా కుదిరింది. నటన పరంగా మాత్రం ఫుల్‌ మార్క్‌ సాధించాడు సుశాంత్‌. హీరోయిన్‌ గా పరిచయం అయిన రుహాని శర్మ తొలి సినిమాతోనే సూపర్బ్‌ అనిపించింది.

ప్ల‌స్ పాయింట్స్‌:

న‌టీన‌టులు

కెమెరా వ‌ర్క్‌

సంగీతం

సుశాంత్‌, రుహానీశ‌ర్మ అభిన‌యం

కామెడీ పార్ట్ స‌హా స‌న్నివేశాల‌ను.. ఎమోష‌న‌ల్‌గా న‌డిపించిన తీరు

మైన‌స్ పాయింట్స్‌:

స్లో నెరేష‌న్‌

కొన్ని సీన్స్ అతికించిన‌ట్లు అనిపిస్తాయి

చివ‌రిగా: ఈ పెళ్లికి అంద‌రూ ఆహ్వానితులే

రేటింగ్‌: 3.0