బ్ల‌ఫ్ మాస్ట‌ర్ సినిమా రివ్యూ
Spread the love

న‌టీన‌టులు: స‌త్య‌దేవ్‌, నందితా శ్వేత‌, బ్ర‌హ్మాజీ, పృథ్వీరాజ్‌, చైత‌న్య ‌కృష్ణ‌, సిజ్జు, టెంప‌ర్ వంశీ, బాల‌కృష్ణ, ఆదిత్య మేన‌న్ త‌దిత‌రులు

సంగీతం: సునీల్ క‌శ్య‌ప్

ఛాయాగ్ర‌హ‌ణం: దాశ‌ర‌థి శివేంద్ర

ర‌చ‌న: గోపిగ‌ణేష్‌, పుల‌గం చిన్నారాయ‌ణ‌

కూర్పు: న‌వీన్ ‌నూలి

క‌ళ‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి

స‌మ‌ర్ప‌ణ‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై

ద‌ర్శ‌క‌త్వం: గోపిగ‌ణేష్

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రాలు దాదాపుగా అనువాదాలుగానో లేదంటే రీమేక్‌లగానో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తుంటాయి. ఇప్పుడు అలాంటి చిత్రమే ‘బ్లఫ్‌ మాస్టర్‌’గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘రోమియో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీ గణేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. సెటైరికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కథేంటి, సినిమా ఎలా ఉంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కథ‌ :

ఉత్తమ్‌ (స‌త్య‌దేవ్‌) త‌న మాట‌ల‌తో ఎవ్వ‌రినైనా బురిడీ కొట్టించ‌గ‌ల నేర్ప‌రి. అత్యాశ ఉన్న‌వాళ్ల‌ని సుల‌భంగా మోసం చేసి రూ.కోట్లు కొల్ల‌గొడుతుంటాడు. ర‌క‌ర‌కాల వేషాలు, పేర్లు మార్చుకుని వంద‌ల నేరాల‌కి పాల్పడిన చ‌రిత్ర అత‌నిది. మ‌రి ఆ నేరమ‌య జీవితం ఎంత‌వ‌ర‌కు సాగింది? అత‌ని జీవితంలోకి అవ‌ని (నందితా శ్వేత‌) ఎలా ప్ర‌వేశించింది? ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అయితే క‌ళింగ‌ప‌ట్నంలో పోలీస‌ులు అత‌న్ని అరెస్ట్ చేస్తారు. పోలీసులు ఎంత కొట్టినా డ‌బ్బులు ఎక్క‌డ దాచింది పోలీసుల‌కు చెప్ప‌డు. అదే డ‌బ్బుల‌ను ఉప‌యోగించుకుని కోర్టు, పోలీసుల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. అయితే డ‌బ్బులుంటే ఎదుటి వ్య‌క్తి ప్రాణం తీయ‌డానికి కూడా వెనుకాడ‌ని మ‌రో వ్య‌క్తి( ఆదిత్య మీన‌న్‌) ఉత్త‌మ్‌కుమార్ జీవితంలోకి ప్ర‌వేశిస్తాడు. అత‌న్నుండి త‌ప్పించుకోవ‌డానికి తెలివిగా అత‌న్ని, అత‌ని గ్యాంగ్‌ను పోలీసుల‌కు ప‌ట్టిస్తాడు. అయితే త‌ను చేసిన మోసాల కార‌ణంగా ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి, త‌ప్పించుకుని తిరుగుతుంటాడు. ఆ స‌మ‌యంలో ఉత్త‌మ్‌ను అవ‌ని ర‌క్షించి త‌నుండే అనాథాశ్ర‌మానికి తీసుకెళుతుంది. ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకున్న ఉత్త‌మ్ మంచివాడుగా బ్ర‌త‌కాల‌నే నిర్ణ‌యం తీసుకుంటాడు. అవ‌నిని పెళ్లి చేసుకుని చిక్ మంగ‌ళూర్ వెళ్లిపోతాడు. అయితే అక్క‌డ‌కు కూడా ఆదిత్య మీన‌న్ వ‌స్తాడు. త‌ను చెప్పిన‌ట్లు విన‌క‌పోతే నెల‌లు నిండిన అవ‌నిని చంపేస్తాన‌ని భ‌య‌పెడ‌తాడు. చివ‌ర‌కు ఆదిత్య మీన‌న్ బారి నుండి ఎలా త‌ప్పించుకున్నాడు? ఎలాంటి గ‌మ్యం చేరుకున్నాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేష‌ణ‌ :

నిజ జీవితాల్లో ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌ల‌కి అద్దం ప‌డుతూ సాగే కథ ఇది. అత్యాశ‌తో ప్రజలు ఎలా మోస‌పోతుంటారు? వాళ్ల‌ని బురిడీ కొట్టించేందుకు కొంత‌మంది ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేస్తుంటారో ఈ చిత్రంలో చూపించారు. నేరాల బాట ప‌ట్టిన‌వాళ్లకి ఎప్ప‌టికైనా ఇక్క‌ట్లు త‌ప్ప‌వ‌ని.. ఆ జీవితం నుంచి బ‌య‌టికి రావ‌ల్సిందే అన్న నీతిని ఈ సినిమా ద్వారా చెప్పారు. ఆరంభం నుంచి చివ‌రివ‌ర‌కు ర‌క‌ర‌కాల మార్గాల్లో జ‌నాల్ని బురిడీ కొట్టించే ఎపిసోడ్‌లే తెర‌పై క‌నిపిస్తుంటాయి. అవ‌న్నీ మ‌నం నిత్యం పత్రిక‌ల్లో, టీవీల్లో చూస్తున్న ఉదంతాలను పోలిన‌వే. దాంతో ఏ స‌న్నివేశం కూడా ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉండ‌దు. పై పెచ్చు క‌థానాయకుడు చెప్పిందంతా వింటూ జ‌నాలు సుల‌భంగా మోస‌పోవ‌డం మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది.

లుగులో దాన్ని రీమేక్ చేయాల‌నుకోగానే.. ఎలా చేస్తారో అనే సందేహం అంద‌రికీ క‌లిగింది. స్టార్ క్యాస్ట్‌ను తీసుకోకుండా.. స‌త్య‌దేవ్ వంటి అప్‌క‌మింగ్ ఆర్టిస్టుల‌ను తీసుకున్నారు. స‌త్య‌దేవ్ మోస‌గాడి పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించాడు. పాత్ర ప‌రంగా ఎక్క‌డా ఓవ‌ర్ చేయలేదు. న‌ట‌న ప‌రంగా అతికిన‌ట్లు స‌రిపోయాడు. అమాయ‌క‌మైన అమ్మాయిగా నందితాశ్వేత కూడా చ‌క్క‌గా న‌టించింది.

విల‌న్ పాత్ర‌లో న‌టించిన ఆదిత్య‌మీన‌న్, పృథ్వి, బ్ర‌హ్మాజీ, సిజ్జు, చైత‌న్య‌కృష్ణ, ధ‌న‌రాజ్ త‌దిత‌రులు పాత్రల మేర చ‌క్క‌గా న‌టించారు. ద‌ర్శ‌కుడు గోపీగ‌ణేష్ త‌మిళ సినిమా క‌థ‌నే తీసుకున్నా పెద్ద‌గా మార్పులు చేయ‌కుండా చిన్న చిత‌క మార్పుల‌తో సేమ్ టు సేమ్ అలాగే తెర‌కెక్కించాడు. క‌థ‌లో స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. హీరో అంద‌రినీ మోసం చేసే సన్నివేశాలు బావున్నాయి. గోపీ గ‌ణేష్, పుల‌గం చిన్నారాయ‌ణ అందించిన సంభాష‌ణ‌లు స‌న్నివేశాల ప‌రంగా బావున్నాయి. శివేంద్ర కెమెరా ప‌నితనం, సునీల్ క‌శ్య‌ప్ సంగీతం, నేప‌థ్య సంగీతం బావుంది. మొత్తంగా బ్ల‌ఫ్ మాస్ట‌ర్.. జ‌రిగే మోసాల‌ను చ‌క్క‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు

బ‌లాలు:

స‌త్య‌దేవ్ న‌ట‌న

మాట‌లు

సినిమాటోగ్ర‌ఫీ, సంగీతం

డైలాగ్స్‌

బ‌ల‌హీన‌త‌లు:

స‌న్నివేశాల్లో ఆస‌క్తి లోపించ‌డం

సెంటిమెంట్ పండ‌క‌పోవ‌డం

రేటింగ్‌: 2.5